87
-- a 7 చైనాలో విద్యార్థు లొనర్చిన మహాప్రబోధము (శ్రీ అ. కాళేశ్వర రావుగారు, బి.ఏ., బి.ఎల్.) చైనావిద్యార్థులొ కరించుటకు పూసికొనిన ముఖ్యమైన మహత్కార్యము ప్రజాప్రబోధమై యున్నది. విద్యాలయములు తెరచియున్న దిన ములలో విద్యార్థులు విద్యాలయమునకు సమీ పముననున్న ప్ర్ర దేశము లోని సామాన్యజనుల కుపన్యాసముల నిచ్చిరి. వేసంగి శలవులలో పట్టణ ములకును పల్లెలకును పోయి యుపన్యాసములని చ్చిరి.తరుచుగ స్వ దేశిసరుకులను వెంటగొనిపోయి ప్రజలకమ్మి వారిలో “స్వ దేశీ ” యభిమానమును కలుగ జేయుచుండిరి. ఒక్కొక్కపుడు సంగీతము తోగూడ నుపన్యసించిరి. ఈయుపన్యాసములలో రాజకీయ సాంఘిక విషయముల గూర్చియు దేశ పరిస్థితులనుగూర్చియు చెప్పుటయేగాక ఆరోగ్య ముశరీర శాస్త్రము ప్రకృతిశాస్త్రములు మొద లగు విషయములను గూడ బోధించిరి. ప్రతిచో టనుసామాన్యజనులకొరకు పాఠశాలలను స్థాపించి అజ్ఞానమును పోద్రోలుటకు విద్యార్ధులు లగ కృషిసల్చిరి. ఒక్క పికింగనగరమున విద్యా ర్థులచే నడపబడుచుండిన పాఠ శాలలు పందొమ్మిది యుండెను. వాటిలో 2326 మంది చదువు కొనుచుండిరి. శలవులలో తమ స్వగ్రామములు లోను చుట్లుపట్లను పాఠశాలలను స్థాపించుచు వచ్చిరి. 1921 వ సంవత్సరమున ఫూచోకళా శాలలోని 123 విద్యార్థులు వేసంగి శలవులలో కొన్ని జట్టులుగ చీలి గ్రామములలోనికి పోయి 3000 మంది విద్యార్థులుగల 28 ఉచితముగ చదు వు చెప్పు ప్రాధమిక పాఠ శాలలను స్థాపించి వచ్చిరి. ప్రజలలో చదువురానివా డుండగూడదు. చా 1922 వ సంవత్సరమున చైనా దేశములోని వ కోట్లకొలది జనులలో వ్యాపించియున్న అజ్ఞాన మును పోద్రోలి నూటికి నూరుమందికిని అక్షర జ్ఞానముకలుగ చేయవలెనను మహాప యత్నము చాంగా al జిల్లా విద్యార్థి సంఘము వారు ప్రారం భించిరి. ఇందుని గూర్చి జిల్లాయఁదంతటను ఉత్స వములను సభలను జరిపిరి చదువురానివాడు గుడ్డివాడు, ' నీకుమారుడు గుడ్డివాడా?' 'చదువురాని జాతి బలహీన మైనజాతి,' ( చైనా యొక్క మోక్షము ప్రజలలో విద్యా వ్యాపకము చేయటలో నున్నది.' 'చైనాలో ముప్పాతిక భాగము అంధకారమునందుండగ సహించి యూరుకొనగలవా?' అను మొదలయిన ప్రబోధ వాక్యములను పతాకములమీదను గోడల మీదను లాంతరు స్థంభములమీదను 'వ్రాసిరి. వందలకొలది విద్యార్థులు జిల్లాలోని పట్టణము లకును పల్లెలకును పోయి 1922 వ సంవత్సరము మార్చినెల మొదలు జూలై నెలవరకును అయిదు నెలలు వేలకొలది జనులకు ప్రాధమ! విద్యను నేర్పిరి. ఇటులనే ఛీఫోజిల్లాలోని విద్యార్థి సంఘ మువారును విద్యను వ్యాపింప జేసిరి. యావతులు గృహములలోని స్త్రీలకు విద్య నేర్పుటకు పూను కొనిరి. ఈ రెండు జిల్లాలలోను జరిగిన పని యొక్క ఫలితమువలన నీయజ్ఞానమును పార దోలు మహోద్యమము దేశముయొక్క పెక్కు ప్రాంతములలో కార్చిచువలె వ్యాపించెను. విద్యావ్యాపకమునందు ప్రజలలోను ప్రభుత్వము నందును శ్రద్ధ చాలగ హెచ్చెను. 1910 వ సంవ త్సరమున దేశములో నూటికి ఒకరు చొప్పున చదువువచ్చిన వారుండగ, 1928 వ సంవత్సర మునకు నూటికి చాల రాష్ట్ర ములలో పదిహేను మంది చొప్పునను కొన్ని రాష్ట్రములలో ఏబది మంది చొప్పునను చదువు వచ్చినవా రుండిరి. చైనాజాతీయ ప్రభుత్వము బలపడిన కొలదియు ప్రజలలో విద్యాభివృద్ధి యింకను పెంపుగాంచు చున్నది. ఇపుడు సాధారణముగ నూటికి నలు బదిమంది చదువుకున్న వారున్నారు.