Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/10

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

88

కొంచెం సూచన : రష్యాదేశపు గ్రంథ భాండాగారాలు (శ్రీ గో. రాధాకృష్ణమూర్తిగారు, బి. ఏ.) రష్యా ఐరోపాఖండంలో ఉన్న ఒక దేశం. ఇది ఏడు పరగణాలు కలిసినది. దీని వైశాల్యం 8,241,673 చదరపు మైళ్లు. అంటే కొంచెం ఇంచు మించు మన దేశానికి ఐదింత లున్నది. రష్యాలో ఉన్న మొత్తం జనసంఖ్య 162,148,000. సుమారు మన దేశ జనసంఖ్యకు సగం రష్యాలో చదువురానివాళ్ళు 48,000,000 అంటే నూటికి 30 మం దన్న మాట' రష్యా వారు సమానసంప త్తివాదులు. ఈ దేశంలో కార్మికులకు కర్షకులకు అందఱి కంటె ఎక్కువ గౌరవం. వారే రష్యాకు 'వెన్నె ముక. . కాయకష్టం చేయనివారిని రష్యా వారు చాలా గర్హిస్తారు. అట్టివారికి ఆ దేశంలో తావు లేదు. ప్రపంచంలో అన్ని దేశాలకన్నా ఈ దేశం మీదే ఎక్కువ పుస్తకాలు వ్రాసారట. అటి ఈ ఈ దేశంలో గ్రంథాలయోద్యమం ఏలాగున్నదో, దాని ఆశయాలేమిటో, అవి ఎంతవఱకు కొనసాగింపబడినవో, వాటివల్ల ప్రజలు ఎంత విజ్ఞానాన్ని గడించారో తెలుసు కోవటం వ్యర్థంకాదు. ఈవ్యాసంలో ఇవన్నీ ఇమడ్చబడి ఉన్నాయి. 1 ప్రపంచంలో ఏ ఉద్యమం గురించి మాట్లా డినా, ఏ స్థితిని గురించి వ్రాసినా ప్రస్తుతం “మహాసంగ్రామానికి ముందు,” “మహాసంగ్రా మానికి వెనుక" అని విభజించటం పరిపా టయి పోయింది. ఆలా గే రష్యా దేశాన్ని గురించి ఏది వ్రాసినా ఆ దేశంలో జరిగిన జాతీయవిప్లవానికి ముందు, దానికి వెనుక, ఉండే పరిస్థితులు భేదాభేదాన్ని పేర్కోటం అలవాటైపోయింది. ప్రస్తుతం అచ్చటి గ్రంథాల యోద్యమాన్ని ఆదృష్టితో పే చూడ్డం మంచివీలు. 2 రష్యా కార్మికవిప్ల వానికిముందు : • అప్పుడు ఆ దేశంలో పెద్ద పెద్ద పట్టణాల యందే గ్రంథాలయా లుంటుండేవి. వానిలో మంచి పుస్తకాలే ఉండేవికాని అవి అందఱి అందుబాటులో లేవు. అప్పట్లో ఈ గ్రంథాలయాలు రెండు తెగలు. ప్రజల చందాలవల్ల స్థాపింపబడి పోషింపబడేవి ఒకరకము. ప్రభుత్వపు ధర్మపుస్తక భాండాగా రాలు రెండవరకము. మొదటివానివల్ల కొంత మందికే లాభం వుండేది. రెండవవాని ఉప యోగం చాలా స్వల్పం. 1905 ఆ ప్ర్రాం తాల్లో చాలా పుస్తకాలు బహిష్కరింపబడి, తగుల పెట్టబడి మొదలగు నవి జరగడంవల్ల ధర్మ పుస్తకాలయాల ఆ కొద్ది లాభం అంత రించి పోయిందని చెప్పాలి. విప్లవానికి తరువాతసంగతి : 1917 వ సంవత్సరం. ఇచ్చటినుంచి ఆ దేశచరిత్రలో ఒక నూతన శకం ఆరంభమైంది. రాజకీయ పరివర్తనంతో