45 ఏలూరు, అన్న దానసమాజము - Annadanasamajam, Ellore. ఏలూరు, అన్న, వస్త్ర, వైద్య విద్యాదానసమాజము 1913 సం॥ రమున స్థాపింపబడెను. ప్రభుత్వమువారు స్థలము ధర్మముగ నొసంగిరి. మ. రా. శ్రీ బొమ్మా రత్నంగారి ద్రవ్యసహాయ మున భవనము నిర్మింపబడెను. ఇందు ప్రతిదినము అశక్తులకు అన్నదానము జరుగుచున్నది. ప్రతిసంవత్సరము 15 డిశంబరున బీదలకు వస్త్రదానము జరుగుచున్నది. వేసవికాలమున మంచి నీళ్ల చలివేంద్రలు పెట్టబడుచున్నవి. వైద్య దానము ప్రతిరోజు సాయంకాలము సమాజమువద్ద జరుగుచున్నది. ఒకరోజు అన్న దానమునకు రు 60 లు ధర్మమిచ్చిన స్థిరాస్తులవల్ల వచ్చే ఆదాతో వారు కోరిన తేది 1 రోజున బీదలకు అన్న దానము జరుగును. వస్త్రదానము శాశ్వతనిధి ధర్మము రు 10 లు లగాయతు ఈయవచ్చును. ధర్మములకు రశీదులును, శాశ్వతనిధి ధర్మములకు రసీ దులతో సహా పట్టాలను 5 గురు శాశ్వతధర్మక ర్తలు (రు 500 దాతలు) సంతకముల తొ నిచ్చె దరు. ఎల్లరు సహాయపడ గోరుచున్నాము. ఇతర వివరములకు:- రావు బహద్దరు, మోతే గంగ రాజు జమీందారు గారు కొ త్తమాసు సీతారామయ్యగారు, ( సోల్స్టీలు ) పసుముర్తి పురుషోత్తంగారు, (ప్రెసిడెంటు) మద్దుల వెంకట చినరాజుగారు, (వైస్ ప్రెసిడెంటు) నున్నా 'గంగ రాజుగారు, (వైస్ ప్రెసిడెంటు) కందుల రామయ్యగారు, (సెక్రటరీ) 1 శాశ్వతధర్మకర్తలలోనివారు ఏలూరు, హిందూ యువజన సంఘము Youngmen's Hindu Association, Ellore. ఈగ్రంథాలయము, 1904 సం॥రమున స్థాపింపబడెను. 1918 సంబరము సంఘమురిజష్టరు అయినది. 1928 సం॥రము మ. రా. శ్రీ రా. బ. మోతే గంగ రాజు జమీందారు గారి ద్రవ్యసహా యమున నూతన దివ్యభవనము రు 50,000 లు వెచ్చింపబడి) నిర్మింపబడినది. ఇందు దిన, వార, పక్ష, మాసపత్రికలు, ఆంగ్ల, ఆంధ్రభాషలయందు వచ్చుచున్నవి. ఆంగ్ల, ఆంధ్ర, సంస్కృత గ్రంథములు సుమారు 13 వేలవరకు గలవు. మ్యాజిక్ లాంతరు, వ్యాసరచన పోటీపరీక్షలు, విషయనిర్ధారణ సభలు, వక్తృత్వపోటీపరీక్షలు ప్రతిసంవత్సరము జరుపుచు అందుత్తీర్ణులకు బహుమతు లొసంగ బడుచున్నవి. ఇంకను గ్రంథములు, పత్రికలు తెప్పించవలసిన యున్నవి. ఎలక్టీ సిటీ, రేడియో అవసరము ప్రతిసంవత్సరము ఆదాయమునకు మించిన వ్యయమగు చున్నది. కావు ఎల్లరు శక్తి కొలది సహాయపడును. ధర్మములకు రశీదులను శాశ్వత ధర్మము లకు రశీదులతో పాటు పట్టాలను, 5 గురు శాశ్వతధర్మకర్తల (రు 500 దాతలు) సంతకములతో నిచ్చెదరు. క్యాటలాగులు అచ్చువేయబడెను. బజారులో బ్రాంచి లైబ్రరీకూడ కలదు. ఇతర వివరములకు:-- రావు బహద్దరు, మోతే గంగరాజు జమీందారుగారు, ధర్మకర్తృసభాధ్యక్షులు) మద్దుల వెంకట చినరాజు శ్రేష్ఠిగారు. (ధర్మకర్త సభాగౌరవ కార్యదర్శి)
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/47
స్వరూపం