43 ఇంగ్లీషు-తెలుగు పారిభాషిక నిఘంటువు 530 పుటలు. " వ్యవహారకోశము – శాస్త్ర పరిభాష ” · వెల రు 2-8-0 లు. - 18 " కలసిన సంపుటము రచయిత : దిగవల్లి వేంకట శివరావు, బి. ఏ., బి. యల్. మద్రాసు టెక్స్టుబుక్కు కమిటీవారిచే గ్రంథాలయోపయోగము కొర కామోదింపఓడీనగి, (ఫోర్టు సెంట్ జార్జి గెజిట్ 16-4-35, పుట 258) ఇది కేవలము నిఘంటువు మాత్రమేగాక విజ్ఞానసర్వస్వ సంగ్రహము. దీని నుపయోగించిన కొలదియు నీరు అమూల్య విజ్ఞానము లభించును. మంచి వాగ్ధాల మలపడును. సంభాషణలందు, ఉపన్యాసములందు, గంధర శాన మందు, తర్జుమాలందు నీ వెవ్వరికని జంకనక్కర లేనిశక్తిని ప్రసాదించి నీ విజ్ఞానసంపదకు నీతోడివారును నీ పైవారును గూడ అచ్చెరువంది నిన్ను గౌరవించునట్లు చేయును. సర్వవ్యవహారములందును నీకు తోడ్పడి నీకు పేరు దెచ్చును. నీగిడనను లాభమును పెంపొందించును వ్యాపార వ్యవహారములందేమి, రాజకీయ ఆర్థిక న్యాయశాస్త్ర విజ్ఞానమునందేమి, పదార్థవిజ్ఞాన రసాయన గణిత ఖగోళ భూగోళ భౌతిక జీవజంతుశాస్త్రాది ప్రకృతిశాస్త్రములందేమి, వేదాంతవిద్యయందేమి, వైద్యశాస్త్రము నందేమి మరి యేవిషయమునందేమి ఏ ఇంగ్లీషు పారిభాషిక పదమునకైనను అర్థముగాని, నిర్వచనముగాని వ్యాఖ్యాన ముగాని, పర్యాయపదము గాని నీకు రావలసివచ్చినచో నీవు తడవులాడుకొని దిగ్భ్రాము జెందనక్కర లేదు; ఈ ^ ధమునందది నీకు లభించును. ఇది సమగ్రమును సప్రమాణమును ఆధునికమును అగు ఉత్తమ విజ్ఞానకోశము. మొన్న మొన్న నే వాడుకలోనికివచ్చిన పదములు వాని ఉపయోగములు నవీన శాస్త్ర పరిశోధనల ఫలితములు, అన్ని ఆధునిక సాంకేతిక వైజ్ఞానిక శాస్త్రీయ భావములుగూడ యిందు సమకూర్చబడినవి. కొన్ని వందల హిందూస్థానీపదములు, వానికి తెరుగు ఇంగ్లీషు పర్యాయపదములు గలవు. ప్రపంచ రాజ్య విస్తీర్ణము, జనసంఖ్య, చలామణియు దెలుపు పట్టికలును ఇంగ్లీషు-దేశ వాళీ తూనికలు, కొలతలు, మానములు, గల అను బ౦ధములును గలవు. ప్రభుత్వమువారి తెనుగు తర్జుమా పరీక్షలకు బోవువారికి, తెలుగు తర్జుమా యవసరముగల గ్రామ పంచాయితీ, మునిసిపల్, జిల్లాబోర్డు సహాకార సంఘముల ఉద్యోగులకు, వర్తకులకు, భీమా ఏజంట్లకు, వైద్యులకు, గ్రంధ కర్తలకు, ఉపాధ్యాయులకు ఎల్లప్పుడు చేత నుండవలసిన అమూల్యగ బంధము. “కోర్టులు, రాజకీయములు, శాస్త్రీయ విషయములకు సంబంధించిన ఆనేక పదములకు అర్థములు వాయ బడినవి. వ్యవహారస్థులకు, దేశ సేవకులకు, విద్యార్థులకు, వ్యాసరచయితలకు, దీనివలన గలుగు ప్రయోజనము లనంతములు. ఆంధ్రభాష కిది అమూల్య భూషణము. విద్యాధికుల నేకులప్రస్తుతు లందినది. పాఠ్యగ్రంథనిర్ణయ సభవారి చే గ్రంథాలయోపయోగ నిమిత్త మంగీకరింపబడినది ". —గృహలక్ష్మి, మార్చి 1935. ‘విద్యార్థుల కే గాక ప్రచారకులు, లేఖకులు, పత్రికాసంపాదకులు మొదలగువారికెల్ల జాల నుపయోగమగ నుండగలదు'. 6 - కృష్ణా పత్రిక . 'వ్యవహారపరులేగాక కేవలము భాషాభిమానులును, దీనివలన గొప్ప ప్రయోజనములు పొందగలరు',—భార ఇంగ్లీషు తెలుగు తర్జుమాల యవసరముగల ప్రభుత్వశాఖలందలి అన్ని కార్యాలయములయందును, ఇతర సంస్థలందును ఇది అత్యంతావశ్యకమగుననుటకు సందియము లేదు. - హిందూ.
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/45
స్వరూపం