Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/43

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

" 7 पा సంపాదకీయ ము లు. క్కువ శ్రద్ధ చేసి గ్రంథములు చేర్చినచో సమిష్టి ప్రయత్నముచేత ప్ర్రాంతమున కన్ని శాఖల గ్రంథములనవలీలగా సమకూర్చు కొనవచ్చును. ప్ర్రాంతమునకు కేంద్ర సంఘ మేర్పరచు కొని ఒండొరులు గ్రంథముల నెరపుతీసికొనుచు పూర్లో పయోగము పొందవచ్చును. ఇట్టి పనికి నీశతక గ్రంథాలయముబోటిXంథాలయములు పునా దులు కాగలవు. ఇక రెండవ విషయము ధూళి పూడిలోని శ్రీరాధాకృష్ణ గ్రంథాలయ నిర్వా హకుడు యువకుడునగు వర్మ సుబ్బా రావు గారు 'జండా' యను మాసపత్రికను చేతితో వ్రాసి గ్రంధాలయోపయో గమున కిడుచున్నాడట. ఉగాది సంచిక ప్రేక్షకులను ముగ్ధులను చేయు రీతిగా సచిత్రముగా దీర్చినాడట! ఇట్టి యుత్సాహమునకు నిజముగా విలువ కట్టగల మా ! మరి ఇంకొక్క సంగతి. దేశసేవాపరాయ ణులగు శ్రీయుత గొల్లపూడి సీతారామశాస్త్రి తుమ్మల 'సవయ్య చౌదరీగార్లచే స్థాపితమైన ర్యాణ కావూరు వినయాశ్రమ గ్రంథాలయ మున 500 అమూల్య గ్రంధ రాజము లున్నవట, కాని యాత్రికుల కంటికి తగిన శ్రద్ధ ఇచ్చట కానరాలే దట! ఇట్టి యాశ్రమములలో నిజ ముగా గ్రంథాలయ మెల్ల సంచలమునకు నాది వీఠమై తనరారవలసినది. విజ్ఞాన గంగా ప్రవాహ మిచ్చటినుండి పొంగి పొరలి చుట్టుంగల మానవ మేధఃక్షేత్రములను సకలసస్యాఢ్యములు గావింప సి. ఏలొరో ఈపని జరుగ లేదని ఆశ్రమ నిర్వాహకు లాలోచింతురుగాక. యాత్రికుల యభిప్రాయము తప్పయినదని రుజువగుం గాక! ఆంధ్రప్రముఖులు కన్నుల తెరచి కార్యము పూనుడు. గ్రంథాలయయాత్రలవలన నెంత ప్రయో జనము గలదో పైని మేము శృతపరచిన విషయ ముల వల్లనే తెల్లము కాగలదు. గ్రంథాలయ వ లెను. 121 ములు లేనిచోట్ల నట్టి యాత్రలకు పనిలేదను కొన వలదు. అట్టి చోట్ల తాలూకా సంఘ ములుగాక ఫిర్కాసంఘము లేర్పడి పనిచేయ' యాత్రలోనే గ్రంధాలయస్థాపనను పోత్సహింపవలెను. గ్రామమున కొక పత్రిక నుమ్మడిని తెప్పించు కొనునట్లును ఏ రామాల యముననో రచ్చకట్ట మీదనో కూర్చొని పది మంది ఆపత్రికను చదివించి వినునట్లును ఏర్ప రచుచు దానికొక సంఘమును నిర్మించి ఫిర్కా లో ఏ రెండుమూడుచోట్లనో మంచి గ్రంథాల యముల నిర్మాణమును ప్రోత్సహించుట గ్రంథా లయాభిమానుల విజ్ఞానాభిమానుల దేశాభి మానుల కనీస ధర్మము. ఈ కనీస ప్రయత్నము నడచుటకు శ్రీమతి ఈడ్పుగంటి వెంకట రత్నమ్మగారు చేసిన సలహా తాత్కాలికముగా నుపయోగపరచు కొనవచ్చును. విద్యాపేక్షు లం దరును బ్రహ్మచారులు, 'భవతీ భిక్షాందేహి' యను వాక్యము వారిస్వత్వము. వారికిభిక్ష పెట్టు ధర్మము మనయిండ్లలోని, యన్నపూర్ణలది. గ్రంథాలయము నొక బ్రహ్మచారిగా నెంచి తన యన్నపూర్ణలు దినమున కొకభిక్ష సరస్వతీ భిక్షా పాత్రికయం దిడుగు లేని ఈయుద్యమము కొన సాగిపోగలదు. ఆంధ్ర ప్రముఖులు - ఎల్ల ప్ర్రాంత ములవారును—కన్నులు తెరచి కార్యమునకు గడంగుదురా?

కృష్ణాజిల్లా, దీవితాలూకా, నంగి గెడ్డ గ్రామందు కీ శేషులైన పి వి. దాసు గారి 'వి. దాసుగారి జ్ఞాపకార్థమై గ్రంధాలయ మును కృష్ణామండల డెలిగేటు ప్రెసిడెంటుగారగు పెద సింగు వెంకటనారాయణ గారు తెరచిరి. డాక్టరు గుంటూరు సుబ్బారావుగారు అధ్యక్షులుగాను, అమ్ముల సుదర్శనం గారు ఉపాధ్యక్షులుగాను, అమ్ముల రఘునాధం గారు కార్యదర్శిగాను, అమ్ముల లక్ష్మీనారాయణగారు సహాయ కార్యదర్శిగాను, అమ్ముల రామమూర్తిగారు కోశాధిపతి గాను ఎన్నుకొనబడిరి. ఈ గ్రంధాలయము నిరంతరాభి వృద్ధి నొందుగాక,