1 } 40 సంపాదకీయములు క్ష మాప ణ టించెదము. ఆలస్యమునకు ఈ మాసము మాకార్యాలయమునకు చేరిన వ్యాసాదులు మిక్కుట మగుటచే అనేకవిషయ ములను ప్రకటింపక నిలుపవలసివచ్చినది. జూలై మాసపు సంచికలో ప్రకటిం చెద గుమ్మును క్షమింతురుగాక యని ప్రార్థించుచున్నాము. కొత్తవోట్లు - గ్రంథాలయముల విధి. గ్రంథాలయములవారు కడుజాగ్రత్తగా జూన్ నెల 20 వ తేదీలోపున నిర్వహించవలసిన కార్యక్ర మ మొక్ టి కలదు. 1937 ఫిబ్రవరి నెలలో జరుగబోవు శాసనసభల యెన్నికల -విషయమై ప్రభుత్వము వారును అన్ని పక్షముల ప్రజానాయకులును మెలకువతో పనినడుపుటకు ఉద్యు క్తులై నారు. అందులో ముఖ్యముగా దర ఖాస్తు వ్రాయగల శక్తినిపొందిన ప్రతివ్యక్తి చేతను దరఖాస్తు వ్రాయించి వోటు అర్హతను సంపాదించునట్లు చేయుటకు పాటుపడుచున్నారు. అర్హతగల ప్రతివ్యక్తిని వోటు సంపాదించు కొనునట్లు ప్రోత్సాహపరచుట యందు రాజ కీయ కక్షల ప్రసక్తి యేమియు లేదు. ప్రజలకు శాసనప్ర కారముగల హక్కును సంపాదించి యిచ్చుట తప్ప వేరు జోక్యమిందులో కలుగదు. చోటుహక్కు సంపాదించు కొనునట్లు ప్రజ "లను తయారు చేయుట విజ్ఞాన వ్యాపన కార్యము రా మున్నెన్న దగిన కార్యము. కాబట్టి గ్రంథాలయముల వారు వోటు యొక్క ప్రయో జనమును గుర్తించి ప్రత్యేకము బోధజరిపి దేశమున నెందరికి అరతకలదో అందరును వోటర్లగునట్లు ప్రయత్నించుట పరమవిధి. గ్రంథాలయ సేవకులు ప్రత్యేకము గమనించి తమతమ ఊళ్లలో కార్యకమము నడిపి ప్రజా సేవ యొనరింపవలసిన దాని కోరుచున్నాము. వారం పాదకుడు. రేపల్లె తాలూకా గ్రంథాలయ యాత్ర మేనెల 2 వ తేది మొదలు 8 వ తేదివరకును యార్లగడ్డ శ్రీకృష్ణయ్య చౌదరీ గారధ్యక్షులుగా రేపల్లె తాలూకా గ్రంథాలయ సంఘము వారు జరిపిన గ్రంథాలయయాత్ర కార్య వివరమును మరియొక చోట ముద్రించితిమి. ఈయారుదిన ములలోనెల్లూరు, మైనేనివారిపాలెం, మూర్తోట, సింగుపా లెము,నల్లూరుపాలెం, రేపల్లె బేతపూడి, అడవులదీవి, నిజాంపట్టణము, కల్యాణ కావూరు, కావూరు, చెరుకుపల్లి, పొన్నపల్లి అగ్రహారము, నడింపల్లి, గూడవల్లి, కనగాల, అయిలవరం, పెద్దవరం, జిల్లేపల్లి, పడమటిపాలెం, ధూళిపూడి, పమిడిచుర్రు, ప ల్లెకోన, కారుమూరు, వెల్లటూరు, పెదపులివర్రు, వోలేరు, తూర్పుపాలెం, భట్టి ప్రోలు అను 29 యూళ్లు తిరిగి 34 గ్రంథాలయ ములను దర్శించి గ్రామవాసులను కలిసి సంప కొన్ని చోట్ల బహిరంగోపన్యాసములు చేసి కార్య భారము నిర్వహించిన ఈసంఘము వారి నభినం దించుచున్నాము. వీరు కనుగొనిన విశేష విషయ ములను రెంటిని ప్రత్యేకముగా నమూచు చేయుట యవసరమని తోచును. అయిలవరం శ్రీ శారదా గ్రంథనిలయములో 500 శతక ములు చేర్చగలిగి నారట. ఆకార్య నిర్వాహకు లు ప్రశంసార్హులు, ఒక్క ప్రదేశములోని కొన్ని గ్రంథాలయములు కలియ బలుకు కొని ఒక్కొక్క రొక్కొక్క ప్రత్యేక శాఖావాఙ్మయమునం దె I
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/42
స్వరూపం