Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

} 35 రేపల్లె తాలూకా గ్రంథాలయయాత్ర యువకులు కడు నుత్సాహముతో నీ గ్రంథాలయమును నడుపుచున్నారు. గ్రంథాలయమునకు మూలధనము లేక పోయినప్పటికి జందా ధనమువలననే నడుపబడుచున్నది. యువకులకు బెద్దలకుగూడ నీ గ్రంథాలయమం దాదర ణాభిమానమున్నట్లు గ్రహించితిమి. రాత్రి గం 8 లకు యిచ్చట గ్రంధాలయోద్యమమునుగూర్చి బహిరంగ సభ జరిపితిమి. ఈ గ్రంథాలయ మచిరకాలములోనే చాల యభివృద్ధి జెందఁగలదని మా యాశయము. × శ్రీ సీతారామ గ్రంధాలయము నలూరు పాలెము 3-5-36 Koll ఉ॥ గం॥ 8 లకు సింగుపాలెమునకు మ ఈ మైళ్ల దూరములోనున్న యీ గ్రంథాలయమును జూచితిమి. ఇందు రిజషరువ గైరా లేమియు సరియైన స్థితిలో లేవు. ప్రస్తుతము ఈ కాండా రము నల్లూరు నృసింహాచార్లు గారి యింటియందున్నది. దీనిని తిరిగి పునరుద్ధరింపవలసినదిగా గ్రామ మునసబు గారగు సుఖవాసి వెంకట్రామయ్య మొదలగు వారితో జెప్పితిమి. కొలది కాలములో దీనిని సక్రమమార్గమున నడ పెదమని వారు చెప్పిరి. E శ్రీ కన్యా కాపర మేశ్వరీ గ్రంథాలయము శే పల్లె. 3-5-36 Koll సా॥ గం॥ 3 లకు ఈ గ్రంథాలయము నల్లూరు పాలెమునకు మూడు మైళ్ల దూరములోనున్నది. ఈ భాండాగారమును నడుపుచున్నారు గాని తృప్తికరముగా బని చేయుటలేదు. పత్రికా పాఠ కుల సంఖ్య తృప్తికరముగా నున్నప్పటికి గ్రంధములనిచ్చి . పుచ్చుకొనువారలు లేమిజేసి సరిగా బనిజేయుట లేదన వలసివచ్చినది. ఇందునుగూర్చి అధ్యక్ష కార్యదర్శులకు శ్రీయుత పువ్వాడ రామభట్టు, పోలు పెట్టి వెంకట సుబ్బా రావు గార్లతో గ్రంథాలయ మందగ మనమునుగూర్చి జెప్పితిమి. ఈ గ్రంథాలయమున కారు దినవారమాసపత్రి కలు వచ్చున్నవి. ఈ నిలయము జక్కని మార్గమున నడుపు టకు వారు ప్రయత్నించుచున్నారు. 6 2 శ్రీ రామకృష్ణు రీడింగురూము, రేపల్లె. 3-5 36 Holl సా॥ గం॥ 5 లకు ఇచ్చటకు బత్తికలువగైరా మూడు నాలుగు చున్నవి. పాఠకుల సంఖ్య తృప్తికరముగానే యున్నది. σ శ్రీ సాహితీX ంధనిలయము, బేతపూడి, 4-5.36 Ko ఉ|| 77 గం॥ లకు 115 వచ్చు రేపల్లెకు 14 మైళ్ళ దూరములోనున్న యీ గ్రంథ నిలయము దిలకించితిమి. ఈ గ్రంథాలయము దృప్తికర ముగా బనిజేయుచున్నది. దగినన్ని వార్తాపత్రికలుఁ గూడ వచ్చుచున్నవి. పాఠకుల సంఖ్య తృప్తికరముగా నున్నది. రిజస్టర్లు సరియైనస్థితిలో నున్నవి. దీనిని డిక్టేటర్' షిప్పుతో శ్రీయుత మోటూరి రాజబాబయ్య గారు నడుపు చున్నారు. యువకు లుత్సాహపూరితులై యీ 79070 లయముయొక్క పనిజేయుచున్నారు. E శ్రీ వేంక టేశ్వర గ్రంథాలయము, అడవులదీవి. 4 5-36 Joll ఉ॥ cll 10 లకు ఈ నిలయము బేతపూడికి 12 మైళ్ల దూరము లో నున్నది. సామాన్యముగా నిచ్చోట బని జరుగుచున్నది. గాని తగినంతకృషి గ్రామవాసులు దీనియందు జూపుట లేదు. నిలయాభివృద్ధినిగూర్చియు గ్రంథాలయావశ్యకతను గూర్చి యు గ్రామవాసులకు జెప్పితిమి. 00 శ్రీ వాణీని కేతనము, నిజాంపట్లము 4-5-36 సంll సా॥ గం॥ 6 లకు ఈ నిలయము ఆడవుల దీవికి 11 మైళ్ళుదూరములో నున్నది. ఇది చాలా కౌలమునుండి నడపబడుచున్నది కాని యధ్యక్ష కార్యదర్శు లీనిలయమునకు తగినంతకృషి సలుపుట లేదు. అందును గూర్చి వారిని శ్రద్ధతీసికొనవలసినదిగా కోరితిమి. రాత్రియిట గ్రంధాలయోద్యమమును గూర్చి బహిరంగ సభ జరిపితిమి. యువకులీ గ్రంథాలయము నుత్సా హవంతముగా నడుపుటకు ప్రయత్నించుచున్నారు. తగినంత సాహాయ్యము జేయవలసినదిగా బెద్దలకు జెప్పితిమి.