1 33 స భ లు -> పోర్టులు 7. ఈ పశ్చిమ గోదావరిజిల్లా గ్రంథాలయ సంఘమును ఆంధ్రదేశ గ్రంథాలయ సంఘమునకు శాఖగా యుండు సదరు సంఘము వారిని 3 అనుమతించగలందులకు నట్లు కోరడమైనది. 8. భీమవరం తాలూకా గ్రంథాలయ సంఘము వారిచే తయారుచేయబడి ఆ తాలూకాలోని గ్రామ గ్రంథాలయ ముల చే ఆచరించబడుచున్న మాదిరినిబంధనలను ఈమహాసభ వారు ఆమోదించుచు, ఈ జిల్లాలోని అన్ని గ్రంథాలయ ములవారు వానినే తమ నిబంధనలుగా ఏర్పాటు చేసికొన గలందులకు కోరుచున్నారు. విచా 9. గ్రంథాలయముల నిమిత్తం రాష్ట్రం మొత్తంమీద గవర్న మెంటువారు ఇచ్చుచున్న పదివేల రూపాయల గ్రాంటు చాల తక్కువయని ఈ మహాసభవారు రించుచు ఇక ముందునుండి సంవత్సరమునకు ఒక లక్షరూ పాయల నైన రాష్ట్రములోని గ్రంథాలయములకు గ్రాం - టుగా ఏర్పరచుటకు మద్రాసు రాష్ట్ర ప్రభుత్వము వారి నీసభవారు కోరుచున్నారు. 10. ప్రభుత్వము వారి చే ఇవ్వబడు గ్రాంటులతో కొను పుస్తకములు, ప్రభుత్వము వారిచే నిషేధింపబడిన గ్రంధ ములనుతప్ప మిగతాగ్రంధముల నన్నింటిని కొనుటకు గ్రంథాలయములకు అధికారమియ్యవలసినదనియు ఈవిష యములో జిల్లా విద్యాశాఖాధికారి సిఫారసు అవసరము లేకుండా చేయించగలందులకుప్రభుత్వమువారి నీసభవారు కోరుచున్నారు. 11. గ్రంథాలయములను 1860 సం॥ 21 నెంబరు చట్ట ప్రకారము రిజస్టరు చేయుటకు చెల్లించవలసిన ఫీజు రు500 అవసరము లేకుండ చేయవలసినదని ప్రభుత్వమువారి నీ సభవారు కోరుచున్నారు. 12. ఈజిల్లాలోని అన్ని థాలయములకును ప్రభు త్వమువారిచే నిషేధింపబడిన గ్రంధముల పట్టికను ఒక దానిని సరఫరా చేయుచు, ఇక ముందు నిషేధింపబడు గ్రంథముల పట్టిక లనుగూడ మూడు మాసముల కొకసారి . 113, సప్లయి చేయునటుల ప్రభుత్వమువారి నీ సభవారు కోరు చున్నారు. - 13. 1 గ్రంథాలయములను సోదా(శర్పి) చేయు టకు ప్రభుత్వోద్యోగులు వచ్చునప్పుడు వారంటులను జారీ చేయించవలసినదనియు, గులు II. సదరు వారంటు పట్టుకొనివచ్చే పోలీసు ఉద్యో పోలీసు సందేహమునకు తావివ్వకుండునటుల డ్రెస్సులో నుండునట్లు చేయవలసినదనియు, II. అట్లు తనిఖీ అయిన పిమ్మట పోలీసువారు వళ : పర్చుకొనే పుస్తకములకు రశీదును గ్రంథాలయమునకు " ఇప్పించవల సినద నియు, IV. పోలీసువారికి తీసికొన అవసరములేని గ్రంధము' లను తిరిగి వెంటనే గ్రంథాలయములకు వాపసు ఇప్పించ వలసినదనియు, ఈ జిల్లా పోలీసు అధికారిని ఉత్తరువు చేయ గలందులకు ఈ సభవారు ప్రభుత్వమువారినికోరుచున్నారు. 14. ఈ దిగువవారిని ఈ జిల్లా గ్రంథాలయ సంఘము నాకు కార్యనిర్వాహక సంఘముగా ఎన్నుకొనడమైనది, అధ్యక్షులు:-దండు నారాయణరాజుగారు ఉపాధ్యక్షులు:-భూపతిరాజు తిరుపతిరాజు గారు, కార్యదర్శులు: పాలకోడేటి సత్యనారాయణశర్మ గారు తేతలి సత్యనారాయణమూర్తిగారు ఆత్మకూరి గోవిందాచార్యులు గారు ఇతర సభ్యులు:- బుద్ధవరపు రాజభూషణరావు గారు మాగంటి బాపినీడు గారు సామవేదం సత్యనారాయణగారు తాడిమేటి కుటుంబశాస్త్రి గారు యర్రమిల్లి నారాయణమూ ర్తిగారు పోతాప్రగడ రామారావు గారు తేతలి భీమేశ్వరరావుగారు వేగేశ్ని సూరపరాజు గారు వద్దిపర్తి రాజారావు గారు
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/35
స్వరూపం