112 గ్రంథాలయ సర్వ స్వ ము. 3. ఈ జిల్లాలోని గ్రామ గ్రంథాలయములన్నియు ఏ కోన్ముఖముగ పని చేసి వయోజన విద్యాభివృద్ధి కలుగ జేయుటకు ఒక ప్రణాళికను తయారు చేసి, ఆచరణలో పెట్టుటకు పశ్చిమగోదావరిజిల్లా గ్రంథాలయ సంఘము వారిని ఈ సభవారు కోరుచున్నారు. 4.1 గ్రంథాలయోద్యమమును వ్యాపింపజేయుటయును, వయోజన విద్యను వ్యాపింపజేయుటయును యొక్క విధ్యుక్త ధర్మములలో నొకటిగను, పశ్చిమ గో వరిజిల్లాలోని అన్ని గ్రంథాలయములు ఏకోన్ముఖము గాను సక్రమముగాను పనిచేయుచు జనులందరియందును వయో జన విద్యావ్యాపకము చేయుటకుగాను 3 వ తీర్మానపకా రము తయారైన ప్రణాళికను ఆచరణలో పెట్టుటకై ఈ దిగువ వివరించిన ప్రకారము ఖర్చు పెట్టుటకు రు 4000ల విరాళమును ప్రతి సంవత్సరము పశ్చిమగోదావరిజిల్లా గ్రంథా లయసంఘుమునకు ఇప్పించవలసినది. పశ్చిమగోదావరిజిల్లా బోర్డువారిని ఈసభవారు కోరుచున్నారు. 11. రివెన్యూ డివిజనునకు ఒక్కరు చొప్పున, మాసము నకు భత్యంతో సహా రు 35 లు జీతంమీద జిల్లా మొత్తం మీద ముగ్గురు ప్రచారకులను నియమించుట. 3 Ill. ఈ ప్రచార ము నందు జనసమూహము నాకర్షిం చుటకై, పైముగ్గురకు ప్లేటులతో సహా ఒక గ్రామో ఫోనున్నూ, ఉపన్యాసములు ఆకర్షణీయముగ వివిధ విషయ ములనుగూర్చి ఇచ్చుటకై స్లెడ్లతోసహా ఒక మాజిక్కు లాంతరున్నూ, గ్రామముల వెంబడి జనులకు పుస్తకములు నందజేయుటకై ఒక గ్రంథాలయశకటమునున్నూ సరఫరా చేయుట, VI. తాలూకాలలో గ్రంథాలయములు సక్రమ ముగా నడపుటకును, కొత్తగా స్థాపించుకొను స్థాపించుకొను రాష్ట్రజిల్లా సంఘములతో ఉత్తర ప్రత్యుత్తరములు జరుపుటకును, ఒక్కొక్క తాలూకా గ్రంథాలయ సంఘమునకు ఒక సం వత్సరమునకు ఒక నూరురూపాయలు విరాళమును ఇప్పిం చుట. V. జిల్లాలో అన్ని తాలూకా సంఘములు ఏరోన్ము ఖముగ పనిచేయునట్లు చూచుటకు రాష్ట్ర అఖిలభారత సంఘములతోను ఇతర సంస్థలతోను ఉత్తర ప్రత్యుత్తర ములు జరుపుటకు గాను జిల్లా గ్రంథాలయ సంఘమునకు సంవత్సరమునకు రు 200 లు విరాళము ఇచ్చుట. 3 V1. గ్రంధాలయములులేని గ్రామములకు ఒక గ్రం థాలయమునుండి మరియొక గ్రంథాలయమునకు గ్రంధ 32 ముల నంపుటకుగాను ప్రతితాలూకా సంఘమునకు ఆరు చొప్పునను, జిల్లాగ్రంథాలయ సంఘమునకు 8 యును మొత్తం 50 గ్రంథాలయ పేటికలను సప్లయి చేయుట. V VII . జిల్లా మొత్తంమీద బాగా పనిచేయు గ్రంధా m లయమునకు గ్రంథాలయ సేవయందు త్సాహము కలుగ జేయు టకు గాను రు 100 విలువగల ఒక బహుమానమును పుస్త కముల రూపమున నిచ్చుట. V1II. మరియు జిల్లా మొత్తంమీద ఆంధ్రమందు బాగుగ మాట్లాడు ఒక వ్యక్తికి బహుమా సమిచ్చట 5.1 ఈ జిల్లాయందు గ్రంథాలయోద్యమమును వ్యాప నము చేయుటకు గాను, ఈ దిగువరీతిగా సహాయము చేయ గలందులకు పశ్చిమ గోదావరిజిల్లా బోర్డువారిని ఈ సభ వారు కోరుచున్నారు. 1I.ఈ జిల్లాలోని అన్ని బోర్డు గ్రంథాలయములను పరి పాలన నిమిత్తమాత్రం ఆయా తాలూకా గ్రంథాలయ సంఘములకు ఇప్పించుచు తాలూకాలో ఒక దానిని కేంద్ర గ్రంథాలయముగ ఏర్పరచుటకును, ఈ పశ్చిమ గోదావరి జిల్లా సంఘమువారిచే ఆమోదించబడిన నిబంధనలు సదరు అన్ని బోర్డు గ్రంథాలయములకు ఏర్పరచుటకును. III. గ్రంథాలయభవనములను కట్టించుటకుఅగు సగముఖర్చులను జిల్లాబోర్డువారు గ్రాంటుగానిచ్చటకును. VI. జిల్లా గ్రంథాలయ సంఘము వారిచే సిఫారసు చేయబడిన గ్రంధములను కొనుటలో అగు సగము ఖర్చును గ్రామ గ్రంథాలయములకును కేంద్ర గ్రంథాలయము లకును గ్రాంటుగానిచ్చుటకును. V. జిల్లాబోర్డు పాఠశాల గ్రంథాలయములను గ్రామ స్థులు అందరి అందుబాటులో నుండునట్లు చేయుటకును. VI. జిల్లాబోర్డు ఉపాధ్యాయులు గ్రంథాలయములలో ఉచితముగా గాని కొంత పారితోషికముతో గాని గ్రంధ భాండాగారి (Librarian) గా పని చేయుటకు అనుమతి నిచ్చుటకును. 3 ఈ 6. ఆంధ్రదేశ గ్రంథాలయసంఘము (Registered under Act XXI of 1860) వారి నిబంధనలలో జిల్లాకు వర్తించునంతవరకును ఆయానిబంధనలను ఏర్పాటు చేయుటకును, వారి నిబంధనలకు వ్యతిరిక్తము కానంత వరకు ఇతర నిబంధనలు ఏర్పాటు చేయుటకును, ఈ సంఘ మును క్రమము గా నడపుటకు అవసరమయిన ఇతర నిబంధ నలును తయారు చేసికొనుటకును జిల్లా గ్రంథాలయ సంఘ మునకు అధికార మియ్యడ మైనది.
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/34
స్వరూపం