.31 సభలు-రిపోర్టులు ద్వితీయ పశ్చిమ గోదావరిజిల్లా గ్రంథాలయ సభ 3–5.36 తేదీ మధ్యాహ్నము భీమవరం తాలూకా పొ౦దువ్వ గ్రామమున జిల్లా బోర్డు అధ్యక్షులగు శ్రీం దండు నారాయణరాజు గారి అధ్యక్షత క్రింద ఈ సభ సమావేశ మయ్యేను. ఆ గాడిచెర్ల హరిసర్వోత్తమరావు ఎం. ఏ. గారు సభను ప్రారంభించిరి. (వారియుపన్యాసము క్రిందటి సంచికయందు ప్రకటింపబడినది.) జిల్లా యొక్క వివిధ భాగములనుండి పెక్కు మంది ప్రతినిధు లేతెంచిరి. అనంతరము అధ్యక్షులగు గారు ఇట్లు ఉపన్యసించిరి: — దండు నారాయణరాజు అధ్యక్షులు శ్రీ నారాయణ రాజు గారు ప్రజల అవసరములు తీర్చు భారము ప్రభుత్వము స్థానిక సంస్థలమీద పెట్టారు. ఆరోగ్యము, మార్గ సౌకర్యము, విద్యా, ఇంకాఇతర విషయములు ఎన్నో వున్నవి. ఈభారము పెట్టుతూ అవసరాలకు ఆదాయమునకు పోలిక లేకుండా చేశారు. భూమిపన్ను, అబ్కా-రిపన్ను, స్టాంపు డ్యూటీ, ఇనకంటాక్సు అంతా ప్రభుత్వానిది. కోట్లకొలదీ ఆదా యము వారిది. అందులో పైసా స్థానిక సంస్థలకురాదు . అదన ముగావేసికొన్న సెస్సులుమాత్రము స్థానిక సంస్థల కిస్తు న్నారు. ఈ కొద్దిధనముతో జిల్లా బోర్డు తన బాధ్యతల నెలా నిర్వహిస్తుంది? కాంగ్రెసువారుకాని మరెవరు కాని ఈస్వల్ప ఆదాయముతో అవసరాలన్నీ నిర్వహించలేరు. `కాంగ్రెసు వారు పోటీ చేయుటలో వచ్చే కొద్ది ఆదాయాన్నీ సద్వి నియోగం చేయుటే తలంపు. శ్రీ పెద్దిరాజు గారు ప్రశిడెంటుగా నున్నపుడు చాక చక్యంతో పనులు చేసేవారికి ప్రభుత్వంవల్ల సహాయ ధనం దొరికేది. ఆయన జిల్లాలో చాలా కొఱతలు తీర్చారు. నాయుడు గారు వచ్చుసరికి ప్రభుత్వం గ్రాంటు తగ్గింది. కాని రైల్వే సెస్సువారికి సహాయపడింది. అప్పుడు అయిదు లక్షల రూపాయిలిచ్చారు. అందులో మూడు లక్షలు అప్పు; రెండులక్షలు మరలనవసరము లేని పద్దతిని. అప్పు మూడు వాయిదాల్లో తీర్చాలన్నారు. అప్పుడు అప్పు చేశారు, ఇప్పుడు తీర్చవలసిన బాధ్యత బోర్డు మీద పడింది. 20 వాయిదా లిమ్మంటే ప్రభుత్వం 5 వాయిదాలుమాత్రం ఇచ్చారు. నిత్యకృత్యములు తీర్చుకోడానికి తోడు అప్పు కూడా తీస్చుకోవలసివచ్చింది. ఇట్టిస్థితిలో ఈబోరు ఏమి లుధ చేయగలదు? బోర్డు ఖర్చు చేయు సొమ్ము సద్వినియోగ మగుచున్నదో లేదో మీరు చూచుకొనవలయును. ఇతర పరీక్షలకు జిల్లాబోర్డు నిలువజాలదు. 3 బుది గ్రంథాలయములకు జిల్లాబోర్డు ఎంతసహాయము చేయ గలదో అంతయు చేయుటకు మేము సిద్దముగానున్నాము. గ్రంధాలయముల ఆవశ్యకత చాలయున్నది. అభినవ కాలమున జరుగుమార్పులను ప్రజలకు తెలియజేయు శక్తి మన ప్రస్తుత విద్యావిధానములో లేదు. ఈ పనికి గ్రం థాలయము లే తగియున్నవి. ప్రస్తుతయుగ సంధిలో సమ స్తమును వ్యక్తిగత లాభముపై ఆధారపడియున్నది. కేవల వ్యక్తిగతలాభము పై ప్రపంచ ఆర్ధిక స్థితి అధారపడి యుండడం ప్రజాసౌకర్యమునకు భంగకరమని మంతులు చెప్పుచున్నారు. ఇతర దేశాలలో ప్రజాసౌకర్యమే దృష్టిలో పెట్టుకొని జీవితవిధానము నడిపించుటకు ప్రయత్నములు చేయుచున్నారు. మానవుని ప్రధాన ప్రకృతి ప్రపంచ శ్రేయోభిలాష గాని స్వార్ధం గాదని స్వార్ధంగాదని వారు చెప్పుచున్నారు. గొప్పగొప్ప యంత్ర నిర్మాతలు. గం ధకర్తలు తమ జీవితమును ధారపోసినది పరార్ధము పై స్వార్ధమునకు గాదు. ప్రభుత్వమునకు వ్యక్తిగత జీవనమునకు ఆధారము కలిగించిన పరార్ధపరత ప్రజలకు అలవడగలదు. పైగా బలవ తరమగు ప్రబోధము ఇక్కడ అవసరము. ఈ మార్పు గలిగించుటకే గ్రంధాలయ విజ్ఞానము తోడ్ప డాలి. ఈ అభివృద్ధికి అనుకూలము ఏర్పడుటకు గం థాలయములు పూనుకొవలయును. వానిని మనము వృద్ధి చేయవలయును. తీర్మానములు. గాని అనంతరము ఈ దిగువతీర్మానములు అంగీకరింపబడిన వి. 1. ఈ జిల్లాలోని అన్ని తాలూకాలలోను కేంద్ర గ్రం థాలయములను స్థాపించుటకును గ్రంధాలయములు లేని గ్రామములలో గ్రంథాలయములు స్థాపించుటకును 'ఈ సంఘమువారు తీర్మానించుచున్నారు. 2. జిల్లాలో ప్రస్తుతము బీదస్థితిలోనుండి పని చేయ లేకున్న గ్రంధాలయములను వెంటనే పునరుద్ధరించుట ఈ మహాసభవారు తీర్మానించుచున్నారు.
పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/33
స్వరూపం