Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/32

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

110

30 జా తీయ కేంద్ర గ్రంథాలయము, లండనునగరము ఎగువుఇచ్చుట - తెచ్చుకొనుట. ప్రపంచము నందలి పుస్తక సముదా యము అనంతము. అందుచేత ఎంతగొప్ప ం థాలయమైనను అన్ని పుస్తకములును కలిగి యుండుట దుస్సాధ్యము. ప్రపంచమునం దం తటను 320 లక్షల వివిధరకములైన గ్రంధము లుగల వని అంచనా వేయబడినది. ప్రపంచము నందెల్ల గొప్ప గ్రంథాలయమగు బ్రిటీషు మ్యూజియం గంథాలయమందు 40 లక్షల గ్రంధములు మాత్రమే గలవు. ఇక మిగిలిన చిన్న · గ్రంథాలయము లందలి గ్రంధముల సంఖ్య చెప్పనక్కరయేలేదు. ఇక ప్రతివత్సర మును తయారగుచున్న కొత్త పుస్తకముల సంఖ్యగూడ అమితముగ నుండుటచే ఒక గ్రం థాలయము వాని నన్నింటిని సేకరించి యుంచ జాలదు. ప్రతిమనుజుని యొద్దను కొన్ని గ్రంధము లుండును. అవిచాలనినాడు గ్రంథాలయమునుండి ఆతడు గ్రంధముల నేరువు దెచ్చుకొనును. అట్లే గ్రంథాలయములు గూడ, తమయొద్ద లేని గ్రంధములను ఇతరుల యొద్దనుండి ఎరువు తెచ్చు కొనుటయును, ఇతరులయొద్ద లేని గ్రంధములను ఎరువు ఇచ్చుటయును అవసరమై పోయినది. జాతీయ గ్రంధాలయ పద్ధతి. లండనునగరమున జాతీయ కేంద్ర గ్రంథా లయము స్థాపింపబడినది. ఇందు 1,00,000 గ్రాం ధములుగలవు. ఇవిగాక ఇంకను ఈగ్రంథాలయ మందులేని పదిలక్షల గ్రంథములు ఏగ్రంథాల యములం దున్న వియు వివరించు నిఘంటు పద్ద తిని తయారు జేసిన గ్రంథముల పట్టికలు ఇందు గలవు, దేశమునందున్న ముఖ్యమైన గ్రంథా లయము లన్నియు దీనికి శాఖలుగ జేయబడి నవి. శాఖా గ్రంథాలయములం దున్నట్టిగాని కేంద్ర గ్రంథాలయమునం దున్నట్టిగాని గ్రంథ ములను పరస్పరము ఎరువు ఇచ్చుకొనుచుండె దరు. ఇట్టి వానిలో గొప్పవి 130 గలవు. విశ్వ విద్యాలయ గ్రంథాలయములు, ఇంకను ప్రత్యేక విషయములనుగూర్చి ఏర్పడిన గ్రంథాలయ ములు అన్నియు ఈ కేంద్ర గ్రంథాలయము ద్వారానే పరస్పరము ఎరు విచ్చుటయు నుఎరువు తెచ్చుకొనుటయును జేయుచుండును. దేశమం తయు 32 తాలూకాలు (Counties) గాను, అయిదుజిల్లాలు (Regional) గాను విభజింపబడి నది. ప్రతిజిల్లాకు జిల్లా గ్రంథాలయమును, తాలూకాకు తాలూకా గ్రంథాలయమును గలవు. ఇవి అన్నియు జాతీయ కేంద్ర గ్రంథా లయమునకు శాఖ లేను. చదువరికి పుస్తకము లెట్లు లభించును ? ఇంగ్లాండు, వేల్సు దేశము నందున్న మొత్త ము జనాభాలో నూటికి 97 సరు గ్రంథాలయ ములయొక్క అందుబాటులోనే నివసించి యుం దురు. ఎవరికైన ఏపుస్తకము కావలసిననుత మకు దగ్గరగానున్న గ్రంథాలయమునకు బోయి అక్కడ ఉన్న యెడల తీసికొందురు. అక్కడ లేని యెడల, ఆగ్రంథాలయము ద్వారా కేంద్ర గ్రంథాలయమునుండి ఆగ్రంథమును తెప్పించు కొని చదువుచుందురు. జాతీయ కేంద్రగ్రంధా. లయమునకు పుస్తకములకై దినమునకు 200 మొదలు 400 వరకు దరఖాస్తులు వచ్చుచుం డును. కేంద్ర గ్రంథాలయమందుకూడ కావల నసిగ్రంధములు లేనప్పుడు, తమదగ్గరనున్న నిఘంటు గ్రంధవివరణ పట్టికలయందు జూచి (109 వ పేజీ చూడుడు.