Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/20

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

B 98 గ్రంథాలయ సర్వస్వ ము . చున్నా మన్న మాట. ఇట్లత్స్యున్ని తాతినీచతమ వ్యవస్థలనూగు లాడు జ్ఞానసరస్వతింజూచి, యీ దౌర్భాగ్యదశకు వాపో సోదరులు గ్రంథాలయోద్యమ నిర్వాహకులు గావలెను. అపుడే ఈ లజ్జాకరమగు దుఃస్థితి వాయును, విద్వాంసులగువారికిగూడ ఉపయోగించు గ్రంథ ములను నిలిపి, వారి సానుభూతి వడయుటకు యత్నించు గ్రంథాలయములు శాశ్వత సంపత్తి నొందగలవు. ఏఋ గ్వేదమువంటి యుద్గ్రంధమో సంపాదించి పెట్టుకొన్న గ్రంథాలయములు, వాని యుపయోగమును విద్వాంసులు కందుబాటులో నుంచుటలో గూడ వైశాల్యము చూపుట లేదు. ఇది నిర్వాహకుల దోషమనియన రాదు. అట్టి గ్రంథ ములు మరల లభియింపవేమోయని వారి భయము, అవయ మును వాపుటకు దగిన వైశాల్యమును ఇప్పటి గ్రంథా లయ విధానము పరిష్కరింపలేదు. కేంద్రమైన విశ్వ గ్రంథాలయ మేర్పడిన నే ఇట్టి కొరంత తీరును. ఇప్పటి గ్రంథాలయములవారు వేరువేరుగా అందరును గలిసి విశ్వగ్రంథాలయమున కొక విధాన మేర్పరచుటకు సహాయ పడవల సియున్నారు. వేదములు మొదలు వాఙ్మయశాఖవరకు, విషయమును బట్టి, కాలమునుబట్టి గ్రంధము లభివృద్ధినొందినవి. ఆట్టి గ్రంధములును కలవు. మన దేశములో కొన్ని గ్రంథాలయ ములలో నున్న వియు, జర్మనీ అమెరికా మొదలగు ఖండ ములలో ఇంతవరకుగలవియు సం సాదించి, వానికి గ్రమముగ వరుససంఖ్య నిర్ణయించుమా నొక్కొక్క శా స్త్రములో నొక్కొక్క క్రమచరిత్ర) వాయుటయు, నా గ్రంధము లతో విశ్వగ్రంథాలయము నేర్పరచుటయు జరుగుచో, నా గ్రంథాలయమే విద్యావాంఛగల ప్రతిమానవునకును విజ్ఞానము యొక్క క్రమరూపమును అద్దమున గట్టినట్లు 18 చూపగలదు. అపుడు నూతనావిషయ పరిశోధనములు జరిగి కొత్తగ్రంధములు పుట్టును. చర్విత చర్వణముగా చేతి కబ్బిన చిల్లర గ్రంథముల వెదకి నాల్గుమాటలు వ్రాసి గ్రంధము నచ్చొత్తించి విద్యార్థులు కండ్లగప్పు ఈ కృత్రిమ విద్యాప్రచార మప్పు డంతరించును. ఏ గ ంథము క్రొత్తగా వ్రాయబడినను, దానిని బరిశోధించి, విషయసాధాన్య మునుబట్టి విశ్వగ్రంథాలయమిచ్చు స్థానమును గమనించి, దానిని విశ్వవిద్యాలయము పాఠ్యగ్రంధముగా నిర్ణయింప గలుగును. అప్పుడు వ్యక్తుల యభిమానములకు దావు గలు గదు. విద్యార్ధులకు బ్రాచీనాధునాతన సిద్ధాంతరహస్య ములు, విశేషములు చక్కగా బోధపడును. విశ్వవిద్యా లయములనుండి కృతార్థులయ్యును, విద్యార్థులు విశ్వ గ్రంథాలయముయొక్క పరమప్రయోజనమును స్వయం వ్యక్తిత్వమున బడయగోరుదురు ఇట్టి మహా సంస్థకు ధనము ఏకీభావము ముఖ్యము. యువకులగు జాతీయాభిమానులు నేడు దేశమున కార్యరంగమునకు దిగవలెను. మాత్రావశిష్టములై, కొనయూ వీరితో నున్న విజ్ఞానవృద్ధికై పాటుపడు సంస్థలు గ్రంథాలయములు, విజ్ఞానచంద్రి) కా గ్రంధమండలలు', గ్రంథమాలలు, సమితులు, సంఘములు, పరిషత్తులు, విద్యాపీఠములు, గురుకులములు, మఠములు, మొదలగున వెన్నోగలవు. ధనలోపము చే కార్యములు నడు వకున్నను, వీనికి జాలవరకు దేశీయులలో పలుక్కు డి గలదు. చాల విజ్ఞాన సేవ చేసినవి. ఇవన్నియు గలిసి తమ పలుకుబడిని వినియోగించి, వాక్సహాయము చేయుటకు దారిచూపుచో అన్నిటికిని బరమప్రాప్యమైన విజ్ఞాన సేవకు ఫలితముగా విశ్వగ్రంథాలయమును సులభముగా నిలుప గలము. కేవలవాచారంభణముగాక క్రియ చేసి చూపగల మని యువకులు చాటగలరు. నామ