Jump to content

పుట:Grandhalaya Sarvasvamu - Vol.10, No.3(1936).pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

99

19 పశ్చిమగోదావరిజిల్లా గ్రంధాలయ సేవకులు* గ్రంథాలయ సేవయఁదు పశ్చిమగోదావరిమం డలము పెక్కువత్సరములనుండి ప్రధానస్థానమును వహించినది. దేశభాషాపత్రికలు అసలే లేక, ఆంగ్లేయపత్రికలు గూడ బహుస్వల్పముగనున్న ఏబదిసంవత్సరములకు పూర్వ కాలమున నే ఈజిల్లా భీమవరం తాలూకాయందు దేశ సౌభాగ్యమునకు సేవ జేయ ప్రారంభించిన మహనీయులు వెలసీ యుండుట భాగ్యము. అట్టి వారిలో శ్రీ కాళ్ళ కూరి నరసింహంగారు ప్రముఖులు. వారికి కుడి భుజమై, తోడునీడయై ప్రవర్తించి, నేటికిని తన నిరుపమానమైన సేవాస్త్రతదీక్షతో - పడుచు కుర్రవానికంటే ఎక్కువ దార్థ్యవంతుడై, వృద్ధ దార్థ్యవంతుడై, వృద్ధ భీష్మాచార్యునివలె తన తేజస్సుతో మెరసిపోవు చున్న ఆ భూపతిరాజు తిరుపతిరాజు తాతను మనమధ్యను జూడగలుగుట నిజముగా మన భాగ్యమేను. వీరిద్దరును ఇంగ్లీషు భాష యొక్క వాసన ఏ మాత్రమును లేనివారు. అయినను దాదాభాయి నౌరోజీ, హ్యూము, వెడ్డెర్ బరన్, రానడే, దత్తు, వీరేశలింగం మున్నగు భారత జాతీయతా నిర్మాతలలో వీరిద్దరును లెక్కింప దగినవారు; దేశ సౌభాగ్యము మీదనే తమ దృష్టిని నిల్పి, సేవావతము నూతగా గొని తమ జీవితములను దేశకళ్యాణమునకై ధారవోసిన మహానీయులు. ఆంగ్లేయ భాష యొక్క వాసన ఏమాత్రమును లేని వీరికి దేశ సేవానిరతి ఎట్లు కలిగింది? దానికి కావలసిన సామర్థ్యము ఎట్లు అలవడినది? వీరిని కదలించిన మహాశకు లేవి ? వునా బెట్టి మాడవసూలు జేయునట్టి - మామూలు పల్లెటూరి కరణంగారు. గ్రామకరణముగాకూడ ఈయన అపూర్వమైన ప్రతిభను సంపాదించి నారు. జ్ఞానపిపాస గలిగిన నరసింహంగారికి దేశ మునకు సంబంధించిన వివిధ సమస్యలను అర్ధము జేసికొనుటకు గ్రామకరిణీక మే పునాదియ య్యె ను. కరణముదగ్గఱనుండి బయలు దేరని సమస్యలు కరణముతలచుకొనిన విడిపడని దేశసమస్యలు ఎందైనగలవా ! ప్రభుత్వమువారు ఆంధ్రమున ప్రచురించిన చట్టములు, కరపత్రములు, వీరికి మొదటిగురువులు-పిమ్మట తెలిసిన వారి నడిగి గ్ర హించినుత పాండిత్యము-దీనితో గ గ్రంధసమీ కరణము- గ్రంథాలయస్థాపనము - వరుసక్రమము లయ్యెను. తోడిగ్రామోద్యోగులకు-రై తులకుసం బంధించిన సమస్యలను పరిష్కరింపవలసివచ్చెను. దానితో అప్పుడు మద్రాసు చట్టనిర్మాణ సభ యందు సభ్యులుగానున్న 'గంజాం వెంకటరత్నం వంతులు కృత్తివెంటి పేర్రాజు పంతులు గార్లతో సాహచర్యముపబ్ర లెను. వారుచట్టనిర్మాణసభలో చాల కాలము చేయు పనికంతకును తగిన సంభారమును సంపా దించి యిచ్చట ప్ర్రారంభమయ్యెను. వారిద్దరును తాము శాసనసభయందు గడించిన ప్రతిభకు శ్రీ నరసింహము గారు పోగు జేసియిచ్చిన అంకెల సహాయమేయని అంగీకరించిన సందర్భము లనే కములుగలవు ఆంధ్ర దేశమున నుండియు గ్రంథాలయములను స్థాపించినవారు - నడపుచున్న వారు చాలమందిగలరు. ఐతే, దాని నొక యుద్యమముగా దీసికొని ఊరూర దిరిగి గ్రంథాలయ ప్రచారము చేసిన వారిలో మన నాయకు లిద్దరును ప్రధములని జెప్పవచ్చును. వారు స్థాపించిన నౌరోజీ గ్రంథాలయము, హ్యూముక్ల బ్బు, వీ రేశలింగ గ్రంథాలయములను శ్రీ కాళ్ళకూరి నరసింహముగారు ఎవరు ? ఈ సంవత్సరమునుండి ఆ సంవత్సరమునకు వరవడి వ్రాసినట్లుగా లెక్కలను తయారుచేయునట్టి - లేక పగ్గమును ఒక రైతు పొలమునకు అడ్డముగా బెట్టివరహాయు, ఇంకొక రైతు పొలమునకు నిలు

  • పశ్చిమ గోదావరిజిల్లా గ్రంథాలయ సభయందు అయ్యంకి వెంకటరమణయ్య గారిచే చెప్పబడిన సంగతులు.