"ఆలంకృత శకస్యాభే! రసభునయ నేందుభిః" శాసనమూలము కన్నడ లిపియందుండుటచే నేనెట్లో శ్రమచేసి యది “రసాభూనయనేందుభిః" యని యొక కన్నడ మిత్రుని సాయమున స్థిరపఱచితిని. అందువలన నది 6121=1216+78=1294 క్రీ.శ. మైనది. కాని యిదియు సందేహముగ నేయుండెను. పిమ్మట వీరభద్రరావుగారి శాసనమునకు మూలము చూచితిని. అందు “రసాభ్రనయ నేందుభిః” అనియుండెను. ఇది దిద్దుబాటులక్కర లేక యున్నది యున్నట్లున్నది. అందువలన నది 1206 +78 =1284 క్రీ.శ. మగుచున్నది. వీరభద్రరావుగారు పొరబాటున ప్రతి లిఖియించిరో, అచ్చుతప్పోయని నేనీ కడపటి పాఠము నున్నది యున్నట్లు తీసికొంటిని. వెంటనే 1284లో నాశాసనము పుట్టియుండునని నే తలఁచి యట్లు కొంతకాలమున తెలుఁగు పత్రికలలో బ్రకటించితిని. నాకుఁ దోఁచినమఱికొన్ని యితరా ధారములఁ గూడనప్పుడు చూపియుంటిని. కాని, యనవి యిచ్చట వ్రాయుట మానితిని. నాసిద్దాంతము నెవ్వరు పూర్వపక్షము చేయలేదు. వీరభద్రరావు గారిని బ్రత్యుత్తరము కూడ వ్రాయుఁడని పత్రికాముఖమునఁ గోరి యుంటిని, వారొకసారి యొనర్చిన ప్రసంగమున సోముఁడు శంభుదాసునకంటె నించుక బూర్వుఁడనవచ్చునని మాత్రము చెప్పిరి. నేను 27.10.14న సువర్న లేఖాపత్రికలో వ్రాసిన వ్యాసము నందలి యుక్తులకెవ్వరును సమాధానము వ్రాయలేదు.
ఇటీవల నాంధ్రసాహిత్య పరిషత్పత్రిక లోఁ బ్కటింపఁబడిన విప్రనారాయణ చరిత్రమున మఱల నాకుఁ గొన్ని యాధారములు దొరికెను. అప్పుడుమఱల నేనిట్లు ప్రకటించితిని.
"సోముఁడుత్తర హరివంశమును వ్రాసినపిమ్మట యెఱ్ఱాప్రగడ హరివంశమును వ్రాసెను. చెదల్వాడమల్లయ్య రచియించిన విప్రనారాయణ చరిత్రావతారిక పద్యములలో
| ఉ. | శాతకృపాణ నిర్దళిత | |
(ఇందు'యెఱ్ఱన మల్లనాహ్వయుల్' అనియుండవలసినట్లు తోఁచుచున్నది?)
కవితాతయగు యెఱ్ఱాప్రగడ (ముత్తాతయై యుండవలయునని తోఁచుచున్నది?) సాళువ నరసింహరాజుకడ బహుమానములందినట్లున్నది. ఈయెఱ్ఱన శంభుదాసుఁడే! విప్రనారాయణ చరిత్రముననే యిట్లున్నది.
| గీ. | సుకవిసంస్తుత్యుళంభుదా ♦ సుని నుతింప | |
కావున హరివంశము రచియించిన శంభుదాసుఁడే యీతఁడు, ఇంకను సందేహముండినచో నిదిచూడుఁడు.
| ఆ. | దురితహరుప్రబంధ పరమేశ్వరుని | |
కాబట్టి యెఱ్ఱాప్రెగడ సాళువ నరసింహరాజుకడ బహుమానములనంది యాతని కాలమున నుండెను. ఈ సాళువ నరసింహరాజు విజయనగర నిర్మాణమైన పిమ్మట రాజ్యము చేసిన (1) హరిహర (2) బుక్క రాయలు మొదలగు వారివంశములోఁ గడపటి పురుషుఁడు. అనగా విజయనగరమును 1834 మొ౹౹ క్రీ॥శ॥ 1400 వఱకును, (నావాదముననుసరించి 128 మొదలు 1400 వఱకును) బాలించిన పదముగ్గురు రాజులలో పదమూడు తరములవఱకు నరసింహరాజును పేరుగల రాజేలేఁడు! ఇంక నున్న వారెవరనగా 1490–1509 వఱకు ముగ్గురు నరస