Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

రాయలు కలరు. విప్రనారాయణ చరిత్రమునఁ జెప్పిన “ఉ.శాతకృపాణనిర్దళిత" యను పద్యమునందలి సాళువ నరసింహరాజు పిల్లలమఱ్ఱి పినవీరన జైమినీ భారతమును గృతినందిన నరసింహరాయుడే యైయుండు ననుకొనినచో (అనగా మొదటి నరసింహరాయలే యనుకొనినను) యెఱ్ఱాప్రగడ పిల్లలమఱ్ఱి పినవీరనకాలీనుఁ డగుచున్నాడు. కావుననే వీరన్న, నన్నయ, తిక్కన, నాచన సోమన, శ్రీనాధులను మాత్రమే శృంగార శాకుంతలమున వర్ణించియున్నాడు. దీనిని బట్టి శ్రీనాధుఁడు యెఱ్ఱాప్రగడ పిల్లలమఱ్ఱి పిన వీరన, సమకాలీనులని దోఁచుచున్నది. కాని యెఱ్ఱాప్రగడ యంతకుఁ బూర్వము పండ్రెండుగురు రాజులకుఁ బూర్వముగల బుక్క రాయనితో సమకాలీనుఁడైన నాచన సోమనాధునితో మాత్రమెన్నటికిని సమకాలీనుఁడుకాఁడు!!(19,1.1915ఁ సువర్ణ లేఖ'చూడుఁడు). ఇందువలన నాచన సోమనాధుఁడు 1284 క్రీ॥శ॥న బుక్కరాయఁడిచ్చిన శాసనముననుసరించి, 18వ శతాబ్దాంతమునను 14వ శతాబ్దాదిని యుండియుండవలయునని దలంచెదను. పెద్దలు నిర్ణయింతురుగాక!

కవికుల మెద్ది

వీరేశలింగము పంతులుగారు వీలైనచోటుల నెల్ల "యీకవి యారువేల నియోగి"యనిచెప్పునట్లే యీతని నియోగియని చెప్పిరి. “అట్లుకాదు శాసనమున (అష్టాదశ పురాణజ్ఞుడని వ్రాసియున్నది. ఈతఁడు వైదికియై యుండునని వీరభద్రరావు గారనికి, “ఏదియు కాదు నాకు కొన్ని చాటుధారలువచ్చును; ఈతడు క్షత్రియుఁ"డని నేనెఱిగిన క్షత్రియమిత్రుఁడనెను శాసనమునందతఁడు బ్రాహ్మణుఁడని స్పష్టముగ వివరింపఁబడియున్నది. నియోగియా వైదికీయాయను విచారణమంత యావశ్యకమైనదికాదు. కేవలమొక్క మతమునందున్న స్మార్తులయందీ స్వల్పభేదమును గురించి తెలియకపోయిన నష్టములేదు. తెలిసికొనక తప్పదందురా?

ఈతని యింటి పేరు నాచిరాజువారు. ఇందుకుదాహరణము: — కూచిమంచి జగ్గకవి సుభద్రాపరిణయమునందలి కృత్యాదిని "నాచిరాజు సోముని” అని వర్ణించినాఁడు, జగ్గకవి యిటీవల వాఁడాతని మాటలు పనికిరావందుమా? సోమునికిఁ బిమ్మట శతాబ్దముననున్న పిల్ల లమఱ్ఱి పినవీరన శృంగార శాకుంతలమున “నాచి రాజునిసోము” అని వ్రాసియున్నాడు. 'రాజు' అని యింటి పేరు వైదికులయందరుదు. కావున నీతఁడు నియోగియని చెప్పనగును. ఇంకను సందేహమున్న నారువేల నియోగి కవియగు కోవెల గోపరాజు వైదిక కవుల వేఱుఁగ వర్ణించి నియోగుల నిట్లు వర్ణించెను చూడుఁడు!

చ.

అనఘుహుళక్కి భాస్కరుమ
        హామతి పిల్లలమఱ్ఱి పెద్ది రా
జును బినవీరరాజు కవి
        సోముని తిక్కనసోమయాజి కే
తనకవి రంగనాధునుచి
        తజ్ఞుని నెట్టిన నాచిరాజుసో
మన నమరేశ్వరుం దలతు
        మత్కులచంద్రుల సత్కవీంద్రుల౯.

అని స్పష్టముగ “నాకులచంద్రులు” అని వ్రాసియున్నాడు. కావున నాచన సోమనాధుఁడు నియోగి యని స్పష్టముగ చెప్పవచ్చును.

ఇంటిపేరు.

నాచిరాజను పూర్వపురుషుని పేరున బిలువఁబడు యింటి పేరుగల యాతఁడని చెప్పవచ్చును. ఈయింటి పేరు నాచిరాజను సోమునితాతనుండియో తండ్రినుండియో వచ్చియుండు పౌరుష నామమేయైయుండును.

గోత్రము.సూత్రము.

భరద్వాజస గోత్రజుఁడని శాసనమున స్పష్టముగనున్నది. స్థలాభావమున నుదాహరింపనైతిని. (ఎపిగ్రాఫికా కర్నాటికాలో కనుగొనిన 46గొరి బిదునూరు శాసనముకానీ, వీరభద్రరావుగారు కనుగొనిన 158 మళబాగల శాసనముకాని చూడుఁడు) అపస్తంబనూత్రుఁడగుట బ్రాహ్మణుఁడగుట నిర్వివాదాంశము! (Vide inscription).