ఉపాగ్రాసనాధిపతులు, — చిలక మతి్ లక్ష్మీ నరసింహము గారు, నూరి నరసింహము గారు.
కార్యదర్శులు,—నాళం కృష్ణారావుగారు, అ య్యంకి వేంకటరమణయ్య గారు.
ఇతర సభ్యులు.
రొయ్యూరు రామచంద్రప్రసాదరావు గారు, రొయ్యూరు.
గోపరాజు బ్రహ్మానందం గారు, బెజవాడ.
బొడ్డపాటి శేషగిరి రావు గారు, పొద్దుటూరు.
బొడ్డపాటి హనుమంతరావు గారు, బొడ్డపాడు,
బాలసరస్వతీ సంఘము, అంగలూరు.
వేమూరి రాంజీ రావు గారు, మచిలీపట్నం.
కొడాలి శివరామకృష్ణారావు గారు, డిటొ
టి. యన్. శర్మగారు, ఉంగుటూరు.
నిడమర్తి లక్ష్మీనారాయణగారు, నిడమర్రు.
బెల్లంకొండ రాఘవరావుగారు, పమిడిపాడు. నర్సారావు పేటపోష్టు.
సత్తెనపల్లి హనుమంతరావు గారు, దుగ్గిరాల.
చట్టి నరసింహారావుగారు, గుంటూరు,
చలా శేషగిరిరావు గారు, గుంటూరు.
పులిపాక వెంకటరామారావుగారు, ఈమని.
అంచే శివయ్య గారు, ఈమని. తెనాలి తాలూకా.
కుప్పా శ్రీ రామశర్మ గారు, అనంతవరం. తెనాలి తాలూకా.
అద్దంకి సత్యనారాయణమూర్తి గారు, రాజమండ్రి.
రామానుజ పు స్తక భాండాగారము, తుని.
ఆకెళ్ళ వెంకట సుబ్బారాయుడు గారు, అమలాపురం.
పీపిల్సు ఎస్సోసియేషన్, కాకినాడ,
బిక్కని వెంకటరత్నం గారు, చోడవరం. రామచంద్రపురం తా.
భాగి సుబ్రహ్మణ్యం గారు, శికింద్రాబాదు.
ఇ. సుబ్బుకృష్ణయ్య గారు, హైదరాబాదు.
చివుకుల అప్పయ్యశాస్త్రి గారు, శికింద్రాబాదు.
యస్. నగరాజారావు గారు, జానోదయ సమాజం. నెల్లూరు.
తిక్కనపుస్తక భాండాగారము, డిటో
రామమోహనధర్మపుస్తక భాండాగారము, గండివరం,
కడవలూరు పొష్టు, నెల్లూరుజిల్లా.
పొణకా పట్టాభిరామరెడ్డి గారు, పొట్లపూడి,
మారేపల్లి రామచంద్రశాస్త్రి గారు, విశాఖపట్నము.
కే. జోగారావుగారు, ఎలమంచిలి.
ఆంధ్రభాషాభివర్ధనీ సంఘము, బరంపురం.
తిత్తి బలరామయ్య గారు, బారువ,
డి. కృష్ణారావు గారు, బరంపురం.
ఆంధ్రభాషాభివర్ధనీ సంఘము, పొద్దుటూరు, కడపజిల్లా.
రామకృష్ణ పరమహంస రీడింగురూమ్, కడప,
దేశపాండ్య సుబ్బారావు గారు, నంద్యాల.
మిత్రమండలి, బళ్ళారి.
9వ తీర్మానము.
తెనాలి తాలూకా దుగ్గిరాల భాషాభిలాషిణీ సం ఘమునకు భవనమునునిర్మించుచున్న పునాదిపాటి గ్రామ వా స్తవ్యులును ఉదారస్వభావులునుగు, యేర్లగడ్డ పెన్నీ డు చౌదరి గారి కీ సభ వారు వందనము లర్పించుచున్నారు. ఇట్లే ఆంధ్రదేశములోని జమీందారులును ధనవంతులును గ్రంధాలయోద్యమమునకు సహాయమును జేయుదురని ప్రార్ధించుచున్నారము.
10 వ తీర్మానము.
ముందు సంవత్సరమీ సభను నెల్లూరు జిల్లాయందు చేయుటకు తీర్మానింపడమైనది. ఈతీర్మానమును పొట్ల పూడి వా స్తవ్యులగు పొణకా పట్టాభిరామ రెడ్డి గారు ఉ పపాదించిరి. నెల్లూరు వాస్తవ్యులగు యన్. నాగరాజా రావుగారు బలపరచిరి.
తదుపరి అగ్రాసనాధిపతి గారు తమ యంత్యోప న్యాసమును ముగించినపిమ్మట, కొవ్యూరు వాస్తవ్యులగు తల్లాప్రగడ సూర్యనారాయణ రావు పంతులు గారు అగ్రా సనాధిపతి గారికిని, ప్రతినిధులకును వందనము లర్పించిరి. అంతటితో సభ ముగి సెను,