Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/60

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

42


బమ్మెర పోతరాజు కఁడు
        భాగవతంబు జగద్ధితంబుగ౯."

అనుపద్యమువలన విస్పష్టమగుచున్నది.
మఱియు సంకుసాల నృసింహకవియు తన కవికర్ణ రసాయనమున

"సీ.

ఆందోళికలయందు నంతరచరులైన
      శవకృతాకృతులఁ బిశాచజనుల
వాలవీజనములఁ గ్రాలుచునీఁగకు
      గాలునిఖరవర్తు లాండసముల
నేత్రపరంపరా విలకంటకాకృతిఁ
      జేరఁబోరానిఖర్చూరతరుల
పరక రాలంబులై ప్రార్థింపఁగైకోక
      వాయెత్తకుండు జీవచ్ఛవముల
శంఖనాగస్వరాదిక శ్రవణసమద
విన్ఫుటచ్ఛత్ర విస్ఫారిత స్ఫటాక
దిష్టవిన వైద్య వశవర్తి దుష్టఫణుల
ప్రభుదురాత్ముల నెవ్వాఁడ ప్రస్తుతించు.”

గీ.

నరగుణాంకిత మయ్యెనే సరసకృతియు
దూష్యమగు శునరోద్వృత్తదుగ్ధమట్ల
హరిగుణాంకితమయ్యెనే సరసకృతియు
హారసూత్రంబుగతిహృదయంగమంబు."

అనివాక్రుచ్చి గర్హించి యున్నాఁడు. బమ్మెర పోతరాజు కర్ణాటులకుఁ గృతియొసంగి ధనము సంపాదింపవలసినదని శ్రీనాధనిచేఁ బ్రేరేపింపఁబడినపుడు భారతి కన్నీరు మున్నీరుగా నేడ్చుచుఁ బ్రత్యక్షమైనట్లు గాఁగాన్పించిన నతఁడు

"ఉ.

 కాటుకకంటినీరు చను
     కట్టుపయింబడ నేలయేడ్చెదో
కైటభదైత్యమర్దనుని
     గాదిలికోడల!యోమదంబ! యో
హాటకగర్భురాణి! నిను
     నాకటికిం గొనిపోయి, యల్ల క
ర్నాట కిరాట కీచకుల
కమ్మ త్రిశుద్ధిగా నమ్ము భారతీ!"

అనిపలికి యామెనూరార్చి నట్లు గాఁ జెప్పెదరు.

ఒకప్పుడు బమ్మెర పోతరాజు పొలముదున్నుకొనుచు నలసిగట్టునఁ గూర్చుండియుండఁగా నతని బావమఱదియని చెప్పఁబడేడీ పై శ్రీనాధకవి “హాళికులు సుఖముగా నున్నారా”యని పరిహాసముజేయఁగా నమ్మహనీయుఁడు

"ఉ.

బాలరసాలపాలనవ
      పల్లవకోమల కావ్యకన్యక౯
గూళలకిచ్చి యప్పడుపు
      కూడు భుజించుటకంటె సత్కవుల్
హాలికులైననేమి గ్రహ
      నాంతరసీమలఁ గందమూలకొ
ద్దాలికులైననేమి నిజ
      దారసుతోదర పోషణార్ధమై."

అని యతఁడు మాఱుమాటాడకుండునట్లుగాఁ బ్రత్యుత్తరం బిచ్చెనని కూడ చెప్పెదరు. ఇట్టి దుృష్టాంతములను మఱికొన్నిటి నాంధ్రసారస్వతమునుండి యెత్తిచూపవచ్చునుగాని గ్రంధవి స్తర భీతివలన వానిని విరమించుచున్నాను.

ప్రాచీన కాలమున సారస్వత జీవనము వృద్ధి బొందకుండుటకు గారణము.

ఈకాలమునందువలె నాకాలమున నచ్చుకూటములు వెలసి, గ్రంధములు ముద్రింపబడి మూల్యమునకు విక్రయింపఁబడుట లేని కారణమున, నాకాలమాన స్వతంత్రమైన సారస్వత జీవనమున కవకాశము లేకయుండెను. ఏతన్మూలమున నాంధ్రసారస్వత మీకాలమునందువలె శాఖోపశాఖలతో వర్ధిల్లుటకు మార్గము లేక యున్న తావుననేయుండి యాకాలఁపుం బ్రభువర్యుల దయాధర్మ భిక్షములకులోనై మనవలసిన దయ్యెను. కాఁబట్టి యాకాలమునాటి సారస్వత జీవనము నొక జీవనముగాఁ బరిగణింప వలసిన పనిలేదు.

పూర్వకాలమునందు కవులు.

పూర్వమునఁ గవులయెడఁ బ్రజలకు భక్తికన్న భయ మెక్కువగ నుండెను. కవులు తిట్టిన శాపమై తగులు