36
గ్రంధములు భాండాగారమునకు జేర్చవచ్చుననెను. ఒక బడిపిల్లలు జదివిన గ్రంథములు మరియొక బడికి బంపుటకును, సంచార కార్యదర్శుల నేర్పరచి మంచి గ్రంథములను జదువుటకు దగిన ఏర్పాట్లు చేయుటకును బూనవలెను. 'లగ్గాను' పట్టణములో నున్న భాండాగారములో ఆన్నియు సద్గ్రంధములే గలవనియు, ఆ జిల్లాలో నున్న మూడు పాఠశాలలలో నన్యోన్య సహాయమును బొందుచు పరస్పరము పుస్తకముల నెరువు దీసికొనుచున్నారనియు, స్వల్పవ్యయముతో నంత యెక్కువ లాభమును పొందుచున్న యితర మార్గములను తాను జూడ లేదనియు కార్నీజీ నుడివెను.
“తనకుండుకున్న విశేషధనములో స్వల్పభాగమును మాత్రము వెచ్చించిన లోకమునకెంతో ఉపకారము చేయగలుగుదునను సంగతిని ధనికులైనవారు గుతే౯రిగి యుండవలసియున్నది. నేను 'ఐశ్వర్యసువాత౯ను గురించి వ్రాసిన వ్యాసములో విశేష ధనముండుట ధర్మకర్తృత్వము వహించుటకేయని వ్రాసి యుంటిని. ధనికులా సంగతి గమనింపవలెను. 5 గాని 10 గాని 25 గాని నవరసులు మాత్రము గ్రంధభాండాగారములలో వినియోగించిన అందువలన నూరురెట్లో లేక వేయిరెట్లో ఫలప్రాప్తి గలుగునను సంగతి అనుభవమువల్ల తెలియనగును. గ్రంధభాండాగారములకు ధనమిచ్చు ధనికులకంటె యట్టి భాండాగారములవల్ల లాభమును పొందినవారు స్వయముగ దాని యభివృద్ధిని కనుగొనుట కెక్కువ అవకాశము గలదు. ఏమహానుభావుడు తన ధనమునేగాక తన శక్తినికూడ ధార్మిక విషయము లందు వినియోగించునో అతడు మాత్రము నిజమయిన దేశభక్తుడు' ధనసహాయము జేసినంత మాత్రము చేత వాని విధి సంపూణ౯ముగ నెరవేరజాలదు. ధనమిచ్చుటకంటె శ్రద్ధవహించి కొనసాగించుటలో విశేషము గలదు.”
ఈ ప్రకారము కార్నిజీ ముత్యములవంటి మాటలతో హితోపదేశము చేసియున్నాడు. అందు ప్రతిమాటకును విలువగలదు. మనకుగల లోకానుభవమువలనచే ఆయుగం సులభమైన పని యనియు స్వయముగ చేయుట కష్టమైన పని యనియు దెలియుచున్నది. కార్నీజి వట్టిమాటలవా డెన్నటికిని గాడు. క్రియాశూరుడు, నిజమైన లోకబాంధవుడు. తాను నిర్ధారణజేసిన పద్ధతి ప్రకారము తన యొక్క ధనము నెటుల ధర్మపుస్తక భాండాగారములకు వినియోగించెనో ఆ మహానీయుని యొక్క దిగువ ధర్మములపట్టికను పరిశీలింపుడు.
(1) 1902 సంవత్సరమునఁ కార్నీజి యిన్ స్టిట్యూటు' అనుదానిని వాషింగ్టను పట్టణమునందు స్థాపించి దానికి 44 లక్షల నవరనుల నిచ్చియుండెను. ఈధర్మము వల్ల మానవకోటికి మిక్కిలి యుపయోగకరమయిన శాస్త్రచర్చ జేయుటకు పరిశోధనకునవకాశము గలిగినది.
(2) ఉపాధ్యాయుల బోధనాభివృద్ధికి కార్నిజీ స్థాపితము. —1905 సంవత్సరములో ఉపాధ్యాయులకు పించను వసతికిని వారి వితంతువుల మనోవతిజ్ఞకిని ఉత్తర అమెరికా ఖండములో 30లక్షల నవరసుల నిచ్చియుండెను.
(3) కార్నిజీ ధీరులనిధి. ప్రాణరక్షణ గావించినవారికి ఆప్రయత్నములో నాపదచెందిన వారికిని, నష్టపడినవారి వారసులకును, అనివార్యమైన బాధ జెందువారికిని సహాయముగ బహుమానములిచ్చుటకు ఈనిధి 1904 సంవత్సరములో 10 లక్షల నవరనులతో స్థాపింపబడినది. ఇది సంయుక్త రాష్ట్రములకు మాత్రము చేయబడిన ధర్మము.
(4) ఈ ప్రకారము ఆంగ్లేయ రాజ్యమునకు 1908 సంవత్సరములో 2 లక్షలన్నర నవరసులను, ఫ్రాంసుకు 1909 సంవత్సరములో 2 లక్షల నవరసులును, రాక్షసకృత్యములకాలవాలమగు జర్మనీకి 1910 సంవత్సరములో 24 లక్షల నవరసులును ధీరుల నిధికై యిచ్చియుండెను.
(5) కార్నిజీ సంధి నిధికి 1910 సంవత్సరములో 20 లక్షల నవరసుల నిచ్చెను.
(6) కార్నిజీ కార్పొరేషనుకు 1911 సంవత్సరములో 50 లక్షల నవరసులను ప్రకృతిశాస్త్ర విద్యకును భాండాగారాభివృద్ధికిని సంయుక్త రాష్ట్రముల వారికై యిచ్చియుండెను.