Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/55

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

37


ఈ విధముగ చేయబడిన కార్ని జీయొక్క పైధ ర్మముల మొత్తము మన రూపాయిలలో 30 కోట్ల 52 లక్షల 50 వేల రూపాయలు కాగలదు. ఈ మొ త్తము ను తలంచిన యే ఆంధ్రునిగుండె ఝల్లుమనకుండును ? కార్ని జీయొక్క ఐశ్వర్వమువాత మన దేశములో నెల్ల రు చదువవలెను. హిందువులలో “అపుత్రస్య గతిర్నా స్త్రీ" యని నమ్మకము గలదు. తాను ధనమెద్విధముగా సంపాదించినను కొడుకనేవాడున్నాడా దానికి కత యని చూచుచుండుట హిందువుని స్వభావము. అట్టివా ని కణములకు కార్నిజీ బోధ బాధకరముగా నుండ వచ్చును. కాని ఆయన దారపుత్రాదులకు తగినంతనూ త్రమిచ్చి శేషించినది ధర్మమునకు వినియోగించవలె నను చున్నాడు, ఆంగ్లేయ పత్రికాధిపతులలో సుప్రసిద్ధుడై నట్టి కీతిజు శేషుడయిన స్టెను కార్ని జీకినిచ్చిన సలహాల ను, కార్ని జీ స్వయము గా వ్రాసిన యనేకవిషయములను మన యాంధ్రయువకులు ముఖ్యముగా జదువవలెనని బ రోడా పత్రికాధిపతుల యభిప్రాయమై యున్నది.

అమెరికాలోని గ్రంథ భాండాగారములకు కార్ని జీ 1918 సంవత్సరమునందు చేసిన ధర్మములయొక్క మొత్తము 4 లక్షల అరువదివేల నవరసులు. ఇతరు లిం దునిమిత్త మిచ్చినది 4 లక్షల నవరసులు ఇది గాక లక్ష 68 వేల 655 గ్రంధములును, గ్రంథభాండాగారముల ని మిత్తము 12 స్థలములును, 101 భవనములును ఇంక చిల్ల ర ధర్మము ల నేకములును చేయబడినవి. 1913 సంవత్స రాంతమునకు ఆండ్రూ కార్ని జీయొక్క ధర్మముల వె త్తము 18 కోట్ల 24 లక్షల రూపాయిలై యుండెను.

పెద్దిభొట్ల వీరయ్య, బి.ఏ., బి.యల్.

పుస్తక భాండాగారములు

వాని నభివృద్ధి జేయవలసిన పద్దతులు.

మన విద్యయొక్క స్థితి.

మనదేశమునందు జనులలో ననేకులు విద్యాగం ధము లేనివారు, విద్యతో సంతగా నవసరము లేదని త లంపబడు స్త్రీలమాటయటుండనిచ్చి, పురుషులలో సహితము రాజకీయోద్యోగములం బ్రవేశింప నెంచువారును, తమ జీవనోపాధికి విద్య యత్యంతయవసరమని తలచెడి కొలదిమందియును, మాత్రమే తమబిడ్డలకు విద్య నేర్పించు చున్నారు. కావున దేశమునందు బహుసంఖ్యాకులు విద్యావిహీనులేగాక నిరక్షరకుక్షులు నైయున్నారు.

మన దేశముయొక్క స్థితి.

దేశమునందు జ్ఞానము వ్వాప్తమై జనులు మౌఢ్య మను బోనడుపవలయునన్న చిన్న పిల్లలనిమిత్తమై పాఠ శాలలును, కర్మకారులు వ్యవసాయదారులు మొదలగు వారినిమిత్తమై రాత్రిపాఠశాలలను పెట్టవలెను. ఇదివర కే కొంత చదువ నేర్చినవారికొఱకై యప్పుడప్పుడు యు పన్యాసములు నిప్పించుటకై ప్రయత్నములు గూడ జరుగ వలసి యున్నవి. తానే దేశమునందు జన్మించినదియు, తన దేశముయొక్క నైసర్గిక స్థితి, శీతోష్ణాదిమార్పులు, పాడి పంటలకును వ్యాపారమునకును గల సౌకర్యములు, జను లు, వారియాచారవ్యవహారములు మున్ను గాగలయంశము లను తెలిసికొని యానందించలేనంతటి దౌర్భాగ్యస్థితివం టిది మానవునకు మఱియొకటి యుండబోదు. ఏదేశమైన ను అట్టి బలపరాక్రమశీలురగు నాగరికా గ్రేసరులగు జాతులు గలిగినదైనను, తన పూర్వపు ఔన్నత్యమును మఱచి తన పూర్వపురుషుల సాధుచరితంబుల నుపఠింపక తన్మూలకముగ ధైర్యసాహసములకు గోల్పోవుటికిచ్చగిం పదు. మన ప్రస్తులేవిద్యా విహీనావస్థకు కారణము మన పూర్వచారిత్రమును మఱచి పోవుటయేయని వేఱుగ చెప్ప · నేల !