Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/37

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

21

ల్లెటూళ్ళను, బల్లెటూరి బ్రజలను మీ రేవగిం చుకొందురేని యభివృద్ధి మిమ్మేవగించుకొ నును. పట్టణములయందలి న్యాయాధికారి కుమారుఁడుగాని, న్యాయవాది కొడుకుగాని పెద్ద సాహుకారి పుత్రుఁడుగాని జమీందా రుని కుమారుఁడుగాని, వారి కుమార్తెలుగా ని, పెద్ద పెద్ద పరీక్షలలో నెగ్గినను, విదేశము లకుఁబోయి క్రొత్తవిద్యలు నేర్చివచ్చినను, మిన్నంటు మేడలపై నివసించినను, గుఱ్ఱపు బండ్లమీఁద షికారుపోయినను, నభివృద్ధి వా రిని వరింపదు. భారతమాతకనుంగుఁ బుత్తుఁ డై, యామెవలనఁ బ్రత్యక్షముగ నుత్కృష్ట ఫలములను బడయు పల్లెటూరి కర్షకుని కొ డుకు, ప్రారంభ విద్యలోఁ దేలినను, నాతఁడు పట్టణయువకునివలె గంభీరముగ వేషమువే యఁజాలని యమాయకుఁడైనను నభివృద్ధి ని స్సందేహముగ వానినే వరించును. అభివృద్ధి వలన, అనఁగా మహాలక్ష్మీ వలన వరింపఁబడు టకు యోగ్యుఁడగు పల్లెటూరి కర్షకునిఁ జూ చి తల కంటగించుకొను మన నాయకులు నాయకాభాసులు.

సంచార భాండాగారములు జనసా మాన్యమురు, ముఖ్యముగాఁ బల్లెటూరి కర్త కులకు విజ్ఞానులుగాఁ జేయుట కుద్దేశింపఁబడి నవి, ప్రకృతమున మనపల్లెటూళ్ళు స్వతంత్ర ముగ నొక్కొక్క స్థిర భాండాగారమును నె లకొల్పుకొనుస్థితిలో లేవు. క్రొత్తగ్రామము లవారు పట్టణమువారిని జూచి భాండాగార ములను స్థాపించినను, వానివలన రవంతయుఁ బ్రయోజనము గలుగుటలేదు. జనసామాన్య ము విద్యావిహీనమైయుండుటయే యిందుల కుఁగారణము, చదువురాని వానియెదులు నెన్ని పుస్తక రాసులుంచినను నేమి ప్రయోజనము? ఇంతవఱకీ భారతభూమిలోఁ తొలుదొ నెన్నదగిన యొక్క బరోడా రాజ్యమునందు మాత్రము సంచార భాండాగారములు కలవు వంగమహారాష్ట్రముల ప్రస్తుతోన్న తస్థితిని బట్టి యా దేశములయందుఁగూడ సంచా భాండాగారము లుండెనని యూహింపవచ్చు ను. గాని విశేషముగ సంచార భాండాగారా ములు గలదియు, వానివలన సంపూర్ణ ఫలము ను బడయుచున్నదియు నింతవఱకు బరోజు రాజ్య మొక్కటియే.

బరోడా రాజ్యమునందలి సంచార భాండా గారముల కార్యక్రమమెట్టిదియో వివరింతు ను. సంచార భాండాగారికులు పరమో యోగములగు పుస్తకములు కొన్ని అన నొకటి రెండు పెట్టెలు, అక్షరాస్యులై, చ వుకొనుటకు గ్రంధములు కొనుగొనఁజాబీ బీదవారి కుటీరములమధ్యకుఁ బంపెదరు. అ క్కడ నాబీద వారావు స్తకములను జదివి చినతరువాత నాపు స్తకములను మఱియె చోటికిఁ బంపి వైచి వేఱకతరగతి పుస్తకము లను మొదటిచోటునకుఁ బంపుకురు. మా జిక్కులాంతరులు, సీనో మెటోగ్రాఫులుగూ బంపి ప్రకృతిచిత్రములను జూపుటయు, భ గోళజ్ఞానమును గలిగించుటయుఁ గూడఁ గల దు. కాని మొదటిపద్ధతి యిప్పుడు బరో రాజ్యముకంటే విద్యావిషయమున వె కఁబడియున్న మనదేశ మునకుఁ బనికి రాజ రెండవపద్ధతి, యనఁగా మ్యాజిక్కులాంత లను, సీసీమెటోగ్రాపులను బంపుటకు విశే ధనమావశ్యకమగుటచే ప్రథమమున మనః వాటిని నిర్వహింపజాలము. ఇక మనమిప్పు సంచార భాండాగారములను నిర్వహించు యెట్లు ?