Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/36

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

20

సంచార గ్రంథ భాండాగారములు

సంచార గ్రంధ భాండాగారము లాంధ్రుల పరిచితములు. వీనినిగుఱించి వినినవారుగూడ మనలోఁ జాలఁ దక్కువగనుందురు. మన దేశములో గ్రంధభాండాగారములు దినదినము నేకములు నెలకొల్పఁబడు నిక్కాలమున సంచార భాండాగార మొక్కటియైన నింతవఱకుఁ బ్రారంభింపఁబడకపోవుటకుఁ దెలియనివారికిఁ దెలియకపోవుటయుఁ, దెలిసిన వారికిఁ గార్యశూరత్వము లేకపోవుటయు, గార్యశౌర్యము గలవారికి మన స్థైర్యమును సహాయమును లేకపోవుటయును గారణములు. గ్రంధకర్తలను, బ్రతికాధిపతులను, మొగమోటంపెట్టియో, నిర్బంధపఱిచియో, ప్రార్థించియో, సగము వెలలిచ్చియో, మఱి యేయితర మార్గములనో కొన్ని పుస్తకములను, గొన్ని పత్రికలను సంపాదించి, యొకచోఁ బెట్టుకొని, స్నేహితులనందఱను జందాదారులుగాఁ జేర్చికొ ని, సాధ్యమైనంతవఱకుఁ దమమాటను జవదాఁట లేనివారినే కార్యనిర్వాహక సంఘములోఁ జేర్చికొని, నిశ్చింతమై నెుక్క చోఁ గూర్చుండి నిరంకుశాధికారము వెలిగించుచుఁ గడుపులోనిచల్ల గదలకుండ మేము భాషాభివృద్ధియు, దేశాభివృద్ధియుఁ జేయుచున్నామని ప్రగల్భములు కొట్టుట కవకాశమీయక యివి సంచారము చేయవలసినవగుట మఱియొక ప్రబల కారణము; ఇన్ని కారణములవలన నివి యింతవఱ కాంధ్రదేశమున బయలుదేర లేదు.

నిర్బంధవిద్యాదానము లేని మన దేశమున వీని యావశ్యకత మితిమీఱియున్నది. చదువన నెట్టిదో యెఱుంగక, విద్యవలనఁ గలుగు ప్రయోజనములు తెలియక, విద్యాభ్యాసము నందాసక్తి లేక, తమ దేశస్థితి సుంతయుఁ దెలియక, పరదేశములున్న వనియైన నెఱుంగక, తామున్న స్థితియే మహోత్కృష్టమైనదని భావించి యధఃపతితులమై పోవుచున్న జనసామాన్యమునకు విద్యాతృష్ణకలిగించుట కీ సంచార భాండాగారములు చాల నుపయోగపడును. వీనివలన, నిర్బంధ విద్యాశాసనము నెత్తిమీఁద మొట్టకున్నను, బ్రజలు చాలవఱకుఁ దమబిడ్డలను బాఠశాలలకుఁ బంపుటయు, వారి విద్యాభ్యాసము విషయమున శ్రద్ధతీసికొనుటయుఁ దటస్థించును. అప్పుడు నిర్బంధవిద్యాశాసన ప్రభావమును దెలిసికొని తమనాయకుల వెనుక నిలిచి, నిర్బంధ విద్యాశాసనమును జేయవలసినదని జనసామాన్యము ప్రభుత్వమువారిని మాటిమాటికిఁ బ్రార్ధింపగా ప్రభుత్వమువారు మనకోరికను సిద్ధింపజేతురని నేనిప్పుడు సిద్ధాంతివలె భావిస్థితిని నిరూపించుట సాహసము కాఁజాలదు.

ఇట జనసామాన్యమనఁగాఁ బల్లెటూరి ప్రజలని నాయభిప్రాయము. దేశమునకుఁ బునా ది పల్లెటూరు. దేశాభివృద్ధి కాధారభూతులు పల్లెటూరిప్రజలు. కావున దేశాభివృద్ధికావలె నని యెవరుకోరినను బల్లెటూళ్ళను బాగు చేయవలయును. వానిమాట మనము మఱచిన చో నభివృద్ధి మనమాట మఱచిపోవును. ప