81
వశ్యమార్దవ మధికము, ఆమె సురచారణ విద్యాధర కుమారుల నెందఱనో చూచియున్నది. సుందర పురువ సందర్శన మెఱుఁగనిదికాదు. మఱియు నొక గంధర్వుడు రాగాంధుఁడై యామె చక్కఁదనమునకుఁ బట్టువడెను. కాని అతనికి హత్తినదికాదు. కవి చిత్రించిన వరూధిని యందమునందు కన్నులసోయగము ముఖ్యమయినది. ఆపై నేత్రాభినయ ప్రౌఢిమయును జూచియున్నాము• మొట్టమొదట ప్రవరాఖ్యుని ఆలేఖ్యతనూవిలాసమునందు నాయికా దృజ్మోహము లగ్నమయినది. ఇందువలన వరూధుని యందు రూపమునకుఁ బట్టువడును. మానసికరుచి స్ఫురించకపోదు. ప్రవరాఖ్యునిఁ గూర్చి నాయిక అదివఱకెఱుగదు. ఉలూచి విజయ యశోగానమున నావఱకె యున్మాదినియై యుండెను. నలగుణకథనమధురిమవలన దమయంతి తగులమునకు 'ఉదయవ్యవస్థ' యేర్పడినది. ఉషాకన్యకు స్వప్న సాంగత్యముచేఁ గవి రసోదయముఁ జేసియున్నాడు. వరూధునియందిట్టి 'దశాచిత్ర' మేమియు లేదు. నలకూబరసన్నిభునిఁ జూచినది అబ్బురపాటుదయించినది. లేచి నడుమల్లాడగా దాగినది. సంపూణ౯మగుచూపుచే ఆ బ్రాహ్మణకుమారుని తారుణ్యవగ్ధ్యము'లను ద్రావినది. భావమందాతని స్పర్శామంజిమననుభవించినది.
ఉత్తమవిమర్శయందు కేవల రూపవివశమయిన నాయికాహృదయము ఉదాత్తస్థానము నాక్రమించుకొనలేదు. ఈరసభేద మెట్లు కలిగినదో తుల్యనాయికల యాచిత్యప్రసక్తివలన తేలఁగలదు.
వనిత తనంతఁదా వలచి వచ్చిన చుల్కన గాదె యేరికి౯" అను కవిమధురచరణమునందు నాయికాశయము కొంత బోధపడుచున్నది. మదనవ్యధా భిన్నతచే 'అలివేణులు వాడివత్తు లగుచున్నారని' పలికెను. అనునయ పూర్వమగు భావదైన్య మిందు చాలఁగలదు. నైజ సిద్ధముగా ఈ నాయిక 'నయభయ' సాధనసంపత్తికలది కాదు. దేవదేవివలె నయచాతుర్య మెఱుఁగదు. భయపెట్టి కాంక్షా మాధుర్యమును బోషించు ప్రౌఢనాయికా లక్షణములును లేవు. ఇట్టి జాతి నాయికలలో రసవిశిష్టమగు 'మిటార'ముండినను శుకగుప్తతి పాత్రలవలె రుచినైచ్యమునకు లోనుగాకుండవలెను. అపుడే సాహిత్యచర్చకు యోగ్యమగుదురు,
సాహసము తక్కువ. ఆత్మగతమయిన ప్రజ్ఞావిశ్వాసముగూడ గానరాదు.'ఇటు జపియించిన౯ విడుతునే' యని ఉలూచి విజయాపహరణమున కాయత్తపడినది. మన్మధుని 'ఏలని బంటుగా, దక్కించుకొనరాదా? నను వీడు పరిగ్రహించినచో' అని వరూధుని సంకల్పమును కదపినది. వాడు తన్ను పరిగ్రహింపవలసినదే కాని, తన్నువాని నేలుకొను ముచ్చటలు దోచవు. నాయిక సాత్విక భావవిశిష్టయియిన ట్లూహించు సరసవణ౯నలం చాలఁగలవు. త్రోపువడిన తరువాత గూడ నాయిక నాయకుని నిందించి యెఱుఁగదు. తిట్లు తూఱుపాఱఁబట్టలేదు. విఫలమనోరధమైన దేవయాన కచునకు 'సంజీవని పని సేయకుండెడుమని శాప' మిచ్చినది. పార్థనిరాకృతయయిన ఊర్వశి కామినీజననిరధ౯కమయిన నపుంసకత్వమును వానికిఁ గట్టిపెట్టినది. కాని వరూధిని 'నేనెక్కడ ? వాని గౌఁగిలెక్కడ?' అని నిస్పృహ విలాపమునారంభించినది.
తరువాత విరహము, వరూధిని ప్రణయిని యని చెప్పియున్నాను. నిశితమధురమైన యుత్కంఠ నందినది. అచట భగ్నదశకుఁ బాత్రమయినది; అయితే దుర్మోహ నైజమగు ఉన్మాద దోషమున కగ్గమయినది కాదు. చూడుఁడు ! హంసీముఖమున 'ప్రియోదంతమును'వినిన ప్రభావతి
| సీ. | ఆరతికిఁగరంబు లైతిరే నవ్విభుఁ | |
| గీ. | అటుగానోఁచకేల నా కైతిరకట ! | |