Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/110

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

80

పూచినపూవును పూచినట్లే దర్శించు మానసికరుచివేఱు. దానినికోసి యాకులతో దారములతోఁ బొదివిచూచు మనోవికారము వేఱు, సహజముగా కొండదాపున పొరలిపోవు సెలయేటి చక్కదనము నాస్వాదించువాఱు కొందఱు. కౌత్తవలతో తవ్విన నిలువు కాల్వలను జూచి యానందించువాఱు కొందఱు. ఇందు మొదటివారు సహజశోభనప్రియులు. రెండవవారు కృత్రిమవిలాసపరతంత్రులు. వరూథిని మొదటిజాతిలోనిది. ప్రవరాఖ్య సంబోధనముపట్ల నాయికా వైదగ్ధ్యము నిరూపించు భావచిహ్నములు కొన్నియున్నవి. ఆరంభదశయందు నర్మపరిచితి కొంత కానవచ్చినను, ప్రణయజనమదకలితములగు నానార్థ ప్రచారములు తోపవు. నాయిక వాక్కులలో మధురమగు నొక దైన్యలాలనము రసజ్ఞుఁడు చవిచూడఁగలడు. అనంతర సంభాషణయందు గూడ మోహావస్థల యందుఁ జూపట్టు చిక్కులు' వరూధినీ వచనములలో లేవు.

కం.

....... యిట్లు పలుక వరుసయె వ్రతులై
దినములు గడ పెడు విప్రుల
జనుునే గామింప......

అని ప్రవరాఖ్యుడు పలుకగా వరూధునికి వదనంబున చిన్న బాటు'వాటిల్లినది.

కం.

 కాముకుఁడగాక ప్రతినై
భూమి ప్రదక్షిణముఁ జేయఁ బోయెడువానిం
గామించి తోడితే తగవా?

అను అర్జునభాషాధ౯ము నూహించిన యులూచికి 'మోమున మొలకనవ్వు' పేటేత్తినది. ఇట వరూథిని యజ్ఞకోటియందు 'పావను లౌటకు' మాకవుగిండ్ల సుఖించుటేగదా ఫలము? అని యెత్తి పలికినది. అట ఉలూచి

కం.

నిను గీతిసాహితీ మో
హనవాణులు చెవులువట్టి యాడింపంఁగా
గనియుండి కాముకుఁడఁగా
నని పలికిన నాకు నమ్మికౌనె నృపాలా!

కం.

అతులితవిలాస రేఖా
కృతులక్షా వలపించియిట్లు త్రిభువనలీలా
వతుల నలయించుటేనా?
వ్రతమనఁగానీకు? రూపవంచితమదనా?

అని భావగర్భితముగా గడుపైన యెత్తెత్తినది. రసపుత్రులీ భాగములు తఱఁచినకొలఁది నా యాశయము తేటలు తేఱఁగలదు. మనుచరిత్రనాయికయందు మనోరథరక్తి యధిక మైనదే; కాని తత్సాధనా నైపుణ్యమునందు విలాసపరములగు 'త్రిప్పులాటలు' తక్కువ.

ప్రణయమువంటి కార్యకరణములయందు పన్నఁబడెడి వలలు మిగుల రహస్యములు. తత్కల్పనములుగూడ క్రమానుగతములై యుండవలెను. అది చతురమకు లక్ష్మణము. వరూధునీ రాగసంకల్పముల పరిణామమునందురు. ఈ భేదము స్ఫురించుచున్నది. రాగ పుష్పము క్రమక్రమముగా రేకులు రేకులై వికసించినది; కాని వశీకరణ వాగురులు మాత్రము పోగు వెంట పోగుతీసి వేసినట్లు తోపవు. ప్రవరాఖ్యుని 'ధీరచిత్తము' పరిమళించినతోడనే

నిక్కము దాపనేల? ధరణీసురనందన! యింక
నీపయి౯ | జిక్కె మనంబు నాకు'.......

అని ఒక్కసారిగాఁ బలికినది. ఇది ఈ నాయి కాగుణములయందొక లోపమని నేను భ్రమింపను; కాని చాతుర్యవతియగు నాయిక యిట్లు ప్రవతి౯పదు. ప్రవరాఖ్యునివంటి బుద్ధిజాడ్యోన్మాదుఁడుగూడ 'ఈ పాండిత్యము నీకు దక్క, మఱి యందేగంటిమే?' యని సాభిప్రాయముగఁ బ్రబోధించి వరూధినీ వైదుష్యమునకు గతిఁగల్పించియున్నాడు. ఇందు నర్మమయిన వ్యతిరేకథ్వనియును గలదు. ఎందుకుఁ జెప్పవచ్చితినన నాయిక యందు వైదగ్ధ్యముకన్న వైదుష్యమధికమని ప్రతిపాదించుటకే!

స్వభావము

వరూధిని పరిస్ఫుటయైన ప్రణయపాత్ర.'వెన్నవలె కఱఁగు' హృదయము గలదని కవిసూక్తి చెప్పనట్లు చెప్పుచున్నది. (ననవిల్తుశాస్త్రము' నావతి౯చినది; కాని యభిమాన శాస్త్రము రహి పుట్టించు గాంధర్వ'మనకతీరదు. పాటయందు అన్నిటికన్న హాయి' నెట్లుపాసించినదో! సౌందర్యార్చనయందు గూడ నైసర్గిక రామణీయకమునే యాప్తముగా నాదరించినది. ఈమె గుణస్వరూపము నాలోచించినచో ఒక రహస్యము పొడకట్టుచున్నది. వరూధునీ స్వభావముందు వశీకరణశక్తికన్న