79
రూపించుటకు అవకాశములు లేవు. తరుణీ అని ప్రవరాఖ్యుడు సంబోధించినాఁడు. అందువలన లేతపడతిగా నతనికి గన్పడితీరవలెను. (అనన్యకాంత'యనుట చేఁ గూడ నామె యీడువాడినది గాదని భావము. నవలాశబ్దమునకు (ఆ ౨.౨గి.) కోమలియను స్ఫురణకలదని కొందఱనిరి; కాని అచ్చ తెనుఁగు నిఘంటువులా రూఢార్దమును శాసించుటలేదు. శాచికులగు కవుల రసవద్రచనయందుఁగూడ ఆయర్థముగానరాదు. వరూధినీ విలాపమునందు (ఆ3_2).
......నోచని యింతిదైన యా
చక్కఁదనంబ దేమిటికి జవ్వన మేటికి'...
అను పలుకులు వినఁబడుచున్నవి. నాయికకు వియోగదశ యలమినది. త్రోపువడి' 'లజ్జాపరవశ భావములతో 'గుమారిల్లుచున్నది. నిస్పృహదృష్టితోనున్న నాయికా సంకల్పములు ఆత్మ విలాపమునందు ధ్వనించుట సహజము. ఈ చక్కదన జవ్వనములు వరూధినివేయైయుండుననుట రసచర్చకు సమీపము. ఇంకను శోధింతము, వనవిహారమునందున్న వరూధిని నామెసబులు దర్శించిన భాగమునకుఁ బోవుదము. వారి సంభాషణయందును అనునయాలాపములయందును ఒక సొబగుస్ఫురించుచున్నది. వరూధిని చిన్నతనమందున్నట్లురు. కులనీతులను సామెతలు నెఱిగిన పెద్దముత్తెదువలా'మె సకియలయినట్లును తోఁచుచున్నది.
* * * ముల్లువుచ్చి కొ
ఱ్ఱడచిన చందమాయె పదమా?......
అను సఖీమణుల సంభాషణల నుండి వారియాఱితేఱి'న' లోక జ్ఞానమూహ్యము. అందఱును 'లేమ?' అని యామె నాదేశించిరి. ఇవియన్నియునటులుంతము. పెద్దనార్యుడింతకంటె రసముగ్ధ మైన విశేషణముచే వరూధిని వయసును సూచించియున్నాఁడు.
తరుణాంగుళీ ధూత తంత్రీస్వరంబుతో ......
లేఁతరికము వదలని వ్రేళ్ళచేత మీటబడిన వీణాతంత్రులనుండి లేచు కలస్వనముతో నామె'జిలిబిలి పాట ముద్దులు నటించు'చున్నదని చెప్పినాడు. లేఁతవగు 'వ్రేళ్ళనుటచే వరూధినీ వయఃతోమలత యంతయు ధ్వనించుచునేయున్నది.
వైదగ్ధ్యము.
వరూధిని చక్కని విదుషి. నిశితమయిన సాహిత్య పరిచయము ఆమె సంభాషణయందెందుఁ జూచినను ఉట్టిపడుచున్నది. కాని నాయికయందు వైద్యము కంటె వైదుష్యమెక్కువ, మన్మధశాస్త్రా ధ్యయనము తాను చిన్ననాఁటీనుండియు జేసితినని చెప్పికొనినది; కాని వీణావాదనమునందును, కీరశారికలకు పలుకులు నేర్పు'టయందును ఆప్తలాలసము గానవచ్చుచున్నది. వీణావాదనముఁజేయుచు నాయిక మన కగపడుచున్నది. రామభూషణుని గిరికానాయికయును ఈయవస్థయందెచిత్రింపఁబడినది; కాని ఈనాయికా ద్వయము నడుమ ఒక భేద మును దీయవచ్చును. వరూధిని వీణపాటయందు 'ఆలాపగతియు' పారవశ్య విభ్రమమును' ప్రధానములుగా మ్రోగుచున్నవి. అందువలన గానకళయందు నాయికకు గల స్వాదురస పక్షపాతము సూచ్యము. ఇంక గిరికాగానమునాలకింతము.'ప్రాణాను బంధములు' వానికిగల 'తాళగతులు,' ముందుఁ జీవింపబడుచున్నవి.'ఆలాపభంగి'యన్ననో అత్యత్త సంవాది స్వరంబులకు గ్రామంబు'లునుచుచున్నవి. ఇందు శాస్త్రీయ సంకేతము అధికము. గిరికకుగల శాస్త్రప్రవేశ ప్రాగల్భ్యమును, తదాభిముఖ్యమును ఇందుధ్వనించుచున్నవి. వరూధిని కిన్నరలోగలహాయి, గిరికావాదనములో లేదు. వరూధినికిఁ బ్రకృతి సౌంద ర్యము ననుభవించు నవనీత హృదయము' కలదు. 'భోగపరుఁడవై' యానందింపుమని ప్రవరాఖ్యుని సంబోధించినది. అపుడా పరిసర ప్రకృతిని తేనెలూఱునట్లు వర్ణించినది. ఆమె కాంక్ష పడీ వలచిన కస్తూరి 'సద్యోవినిర్భిన్నమై పడియున్నది;' కాని బంగారపు బరిణలలో లేదు. జవ్వాజి యెండకుఁగరఁగి, కసటువోయినది. పిదప కఱ్ఱలనంటి' గుమగుమలాడుచున్నది; కాని కృత్రిమపు రూపములతో దాపఁబడి యుండలేదు. ఘనసార తరువుల పొరలలోనుండి పచ్చకర్పూరము పొడిపొడిగా రాలియున్నది. 'పన్నీరు పూలనుండిజాఱినది. 'ఈ వర్ణనమును భావనయందు జీవింపఁజేయుఁడు. ఎక్కడి సౌందర్యమక్కడనే' ఎచ్చటి పరిమళమచ్చటనే! ప్రకృతిసిద్ధముగాఁబడిఁయున్నవి. ఇదియే నైసర్గిక సౌందర్యము. ఇందుసఖీజనులు దిద్దిన కృత్రిమాలంకారంమేమియు లేదు.