76
పంజాబు, గాంధారములలో బహుళః ఉన్ని బట్టలు కూడ వాడఁబడుచుండెడివి. భరతుని తాతయగు కేకయరాజు మనుమనికి కంబళాజినముల నేకములు బహుమాన పూర్వకముగా నిచ్చినట్లు రామాయణమునందున్నది. ఇప్పటి కాలమున నెట్లోయట్లే క్షాత్రయుగమునందును* [1]సొగసైన నేతయును, మిగుల వెచ్చఁదనమును గలఉన్ని శాలువలకు పంజాబు కాశ్మీర దేశములు ప్రసిద్ధివహించి యుండవచ్చును, నూలుబట్టలు వీనికంటె నెక్కువ సన్నని నేతఁ గలిగియుండి రాణివాసము వారును గొప్పవారును ధరించుటకుఁ దగినవిగానుండెనని భారత రామాయణములు చెప్పుచున్నవి.
నూలు, పట్టు, ఉన్నితో మాత్రమేకాక గడ్డితోఁగూడ వస్త్రములు నేయఁబడుచుండెనని వీర కావ్యముల వలనఁ దెలియుచున్నది. వీనిని తాపసులు ధరించుచుండిరి. సీతారాములు తాపస వేషములతో నరణ్యమునకుఁ బోవునపుడు వారు కుశనిర్మితములగు వస్త్రములు ధరించి యుండిరి. అట్లే పాండవులు అరణ్యావాసమునకుఁ జనినప్పుడు అజినములను ఉత్తరీయములు గావాడుకొనిరి. X[2]ధృతరాష్ట్రుఁడు వానప్రస్థుఁడు గాన నరణ్యమునకుఁబోవు వేళ వల్కలాజినములను ధరించెను.[3]ఋషులును ఇతర తాపసులును వల్కలాజిన ధారులుగా వర్ణింపఁబడియున్నారు. ఒక వీర కావ్యములలోనే కాక, వాని తరువాత రచింపఁబడిన వందలకొలఁది గ్రంధములలో తాపసులు ధరించు వల్కలాజినములు వచ్చినవి. కాని ఇట్టి వస్త్రములు ఏగడ్డితోఁజేయఁ బడుచుండెనో ఎట్లు చేయ్యబడుచుండెనో కానరాదు. ఇప్పటికాలమున మాత్రము మనదేశమున కేవలము గడ్డితోఁ జేయఁబడు వస్త్రములు ఎచ్చటను కానఁబడవు. అయినను ఒకప్పుడు మనదేశమందు గడ్డితోఁ జేయఁబడు వస్త్రములుండెనను సంగతి మాత్రము నిజము. "ఈ హిందువులు గడ్డితోఁ జేయఁబడు బట్టలను గట్టుకొనెదరు. వారు నదులలో రెల్లునుగోసి తెచ్చి చీల్చి చాపవలెనల్లి వస్త్రముగా ధరింతురు,” అను 'హీరోడోటసు' వ్రాత వైయంశమును బలపఱచుచున్నది.
మాడపాటి హనుమంత రావు.
| సీ. | వంకరపాగతో ♦ వలెవాటుతోఁ దంబు-రాతోడ నారంగ ♦ రాయ చరిత | |
| గీ. | చేతనముదాల్చి సరసమై ♦ చిత్తరంజ | |