Jump to content

పుట:Grandaalaya Sarvasvamu V.1, No.1 (1916).pdf/105

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

75

దు. “సర్వజనసంహారము జరిగి పృథ్వియంతయు శోకమయమై ఉత్తమ స్త్రీల సీమంతము తీసి వేయబడినప్పుడు..." అను సర్ధముగల శ్లోకము కము *[1] కూడ సీమంతము పోవుట వైధవ్యము యొక్క ముఖ్యలక్షణమని స్పష్టముగా జాటుచున్నది.

మర్యాదగల పురుషులు వెంట్రుకలను ముడి వేసికొనుచు బయటికి వచ్చినపుడు తలగుడ్డ పెట్టుకొనుచు నుండిరి. ఈ తలగుడ్డ పద్ధతి హిందువులు స్వయముగా నేర్పఱచుకొనినదేకాని ఇతరులను జూచి నేర్చుకొనినదికాదని తోఁచుచున్నది. ఇప్పటివలెనే ఆకాలమునందును వారు ధరించు తలగుడ్డ యొక పొడుగుపాటి వస్త్రము. దీనిని వారు తలచుట్టును వివిధములుగాఁ జుట్టుకొను చుండిరి. యుద్ధరంగమునకుఁ బోవు సమయమున భీష్ముఁడు 'తెల్ల తలరుమాలు'ను ధరించినట్లు చెప్పఁబడి యున్నది. ద్రోణుని విషయమునఁగూడ నట్టి వణనయే కలదు. కనుక వయసుమీరినవారి శిరోవేష్టము సాధారణముగా తెల్లరంగుది గాను యౌవనుల తలగుడ్డ యెర్రఁగానో లేక ఏదయిన మరియొక రంగుదిగానో యుండవలెను. హిందువుల తలగుడ్డలు గ్రీకులకు విచిత్రముగఁ గాన్పించినట్లు తోఁచుచున్నది. కనుకనే 'ఏరియను' గ్రంధకారుఁడు 'ఇండికా' యను గ్రంధమున నిట్లు వచించియున్నాఁడు. "హిందువులు దూదితోఁ జేయబడిన యొక వస్త్రమును గట్టుకొనెదరు. అది మోకాళ్ళకును చీలమండలకును మధ్యభాగము వఱకుండును. ఇదిగాక వేఱొక వస్త్రమును పయిన వేసికొందురు. దీనిలో కొంతభాగమును వారు భుజములపయినఁ గప్పికొని తక్కిన భాగమును తమ తలకుఁ జుట్టుకొ నెదరు”.†[2] “ఏరియను చెప్పినట్లు ఒకటే వస్త్రమును తలకుఁ జుట్టుకొనుటకును శరీరమును గప్పికొనుటకు గూడ వాడుకొనువారు బహుళః బీదవారయి యుండవలెను. గొప్పవారి తలగుడ్డ ప్రత్యేక వస్త్రమై యుండవచ్చును. 'కటికాయను రూఫను' అను గ్రంథకారుఁడు హిందూ దేశమును హిందువులను వణి౯ంచుచు “వీరు తమ శరీరమును పాదములవఱకు మృదువయిన సన్నని వస్త్రములతో నాచ్ఛాదించుకొనెదరు. పాదుకలు తోడి గెదరు; దూదితోఁ జేయఁబడినబట్టను తలకుఁజుట్టి కొందురు."¶[3] అని చెప్పియున్నాఁడు. అయినను అప్పటి తలగుడ్డ ఇప్పటికాలమున మనదేశమందలి కొన్ని ప్రాంతములలోనున్నంత చిక్కులు కలదిగాను పొడుగుగాను ఉండలేదని తోచుచున్నది. దానిని జుట్టుకొను పద్ధతి బహుశః ఇప్పుడు ఉత్తర హిందూస్థానములోని పేదవాండ్ర పద్ధతివంటి దై యుండవచ్చును. ప్రతివాఁడును తన తలగుడ్డను తానే చుట్టుకొనుచుండెను. రాజులు మాత్రము కిరీటముల ధరించుచుండిరి. దుర్యోధనుఁడు భీమునితోఁజేసిన తుది ద్వంద్వయుద్ధసమయమున కిరీటము అతని తలపైనుండెను. భగ్నోరుఁడై నేలఁబడిన పిమ్మట నాతని తల పయిన నది యట్లే నిలచియుండెను. కావుననే భీముఁడు దాని కాలితోఁ దన్నఁగలిగెను. ఆ కాలమున కిరీటము శిరమునకు గట్టిగా బిగింపఁబడుచుండెననియు బంధముల వదలించిననేకాని వీడిరాకుండ నుండెననియు మనమూహింపవచ్చును.

హిందువుల వస్త్రములు తఱచుగా దూదితో "నేయబడుచుండెడివి. ఆకాలమున హిందూదేశమున తప్ప మఱెచ్చటను ప్రత్తి పండుచుండుటలేదు. ఈజిప్టులోగాని టర్కీలోగాని యదిపండుచుండునట్లు కానరాదు. ఆట్లు కాదేని “హిందువులు చెట్లపైనఁ బండు ఉన్నితోఁ జేయఁబడిన వస్త్రములను ధరింతురు” అని గ్రీకులు వ్రాసియుండరు. ధనవంతులు అందు ముఖ్యము గా పట్టుబట్టలు ధరించుచుండిరి. X [4]రాజాంత: పురములలోని స్త్రీలు “తకాళేయ వాసినులు" గా వర్ణింపఁబడియున్నారు. పురుషులుకూడ పసుపుపచ్చని బట్టలు ధరించుచుండినట్లు కానవచ్చుచున్నది. మనదేశములోని కాశ్మీరము,

  1. శ్లో॥ సంహారేనర్వతోజాతే వృధివ్యాం శోకసంభవే ॥ బహూ నాముత్తమ స్త్రీణాం సీమంతో ద్ధర వేతధాః కల్య" ఆ౧l _౨౦
  2. Ancient India. Megasthanes and Arrian by Mac Crindle P.210
  3. ¶ Invasion of India by Abxander. Mac Crindle P. 188.
  4. శ్లో॥ సుద్రాంత్వరమాణాన్చి రక్తకౌశీయవాన్ పార్టీ ప్రస్తావయామాన కృత్పి గోపాలశావపు ఆది। ఆ౧౧డ