77
మనుచరిత్ర నాయికలు
వరూధిని
ఆహో ! రసదేవతా ! నీ తారుణ్యము నారాధించిన సహృదయులు ధన్యులు. మహాకవి పెద్దనార్యుని నీవెఱుంగుదువు. ఆరౌచికుని కావ్యపుత్రికయు నిను సేవించినదే; కాని కాల మనేకగతుల భ్రమించినది. ఆమహాకవి నివసించిన నగరము పాడయినది. విద్యానగరనాగరకతీయందలి నానాగుణవికాసముల నిపుడు చర్చించుచున్నారు. అమృతాంశుఁడగు చంద్రుని కిరణగుచ్ఛము లేనగరీమతల్లి యందములను బాలించినవో, అచట నిపుడు పొడుపడిన దిబ్బలపై వ్రాలి మాసిపోవుచున్నవి. మనుచరిత్ర నాయికల నుజ్జీవింపఁజేసిన మనోహరవ్యక్తు లేమయిపోయినవో? పోయినవి. వారిబింబములు రసికులగు ఆంధ్రులహృదయ ఫలకములపైనున్నవి. ఏ సెలయేటి కలకలములలోనో వారి స్మృతిగీతికలు వినవచ్చుచునేయున్నవి. ఇంక స్థూలరూపప్రసక్తి యెందుకు? భావనయందుఁ ప్రతిబింబించు నాయికాస్వరూపమును విమర్శింతము.
చరిత్ర
.వరూధుని పుట్టిల్లు 'సుధాబ్ధి'. చంద్రుని చెల్లెలగు లక్ష్మీదేవి 'తోఁబుట్టువు'. దేశము 'కనక నగ' ప్రాంతము.'రాలుగరఁగించు గాంధర్వము' విద్య. 'మన్మధశాస్త్రాధ్యయనము' వెన్నతిన్న నాటినుండియుఁ జేసినది. 'సవనతంత్రములు' ఓలి పెట్టించుకొన్న లాంఛనములు. రచ్చపట్టులు
కల్పవృక్షచ్ఛాయలక్రింది మరకతమణీ వేదికలు. వైకుంఠ కైలాసములు ఆమెకు నాట్యసభలు. ఇదియంతయు వరూధిని స్వయముగాఁ జెప్పినదే! ప్రవరాఖ్య సందర్శనాసమయమందే కవి యీనాయికా పూర్వవృత్తమును జిత్రించియున్నాడు. నాయిక అపుడు 'అబ్బురపొటు'లో నున్నది. కాని యింకను 'రయోద్ధతి'కి వశురాలగు ఉత్కంఠ దీపింపలేదు. ఈలోపల ఎవ్వతెవీవ'ను 'భూసురకౌతవరుసుమశరాసనునకు బదులు చెప్పినది. వరూధిని వాక్యములయందివి ప్రధమములు కావు. ఇంతంత కన్నులుండఁగా తెరువెవ్వరి వేడెదవను' తొలిసారి మాటలయందు కేవల నర్మ్యప్రాగల్భ్యము సూచింపఁబడినది; ‘భయములేదా' యను సుకుమారప్రౌఢిమ కొంత తరువాత తోపకపోదు, కాని ఎల్లిదమైతిమి మాటలేటికీ౯' అను చివరనుడువులయందే వరూధునీ స్వభావమునకుఁ గవి బీజబిందువులు వేసినాఁడు. ఈనాయికా ప్రధమ సంభాషణమునుబట్టి కొన్ని నైజవిలక్షణములు విమర్శకుఁ డూహింపక పోఁడు; ఈ పె మితభాషిణి; కాని ప్రొఢసూక్తి యెఱుఁగనిది కాదు. సరళధోరణి కలదు; కాని దేవ దేవీ మేనకల వలె ధారాళ వాచాలత లేదు. నిశితశిక్షాలబ్ధమయిన నాతి ప్రౌఢిమ యెంతయో రుచించుచున్నది; అయితే ఆ జన్మసిద్ధమగు ధోరణీ చాతుర్యము ఉలూచీనాయి కాదులయందుంబలె స్ఫురింపదు. వరూధిని స్వభావసిద్ధమయిన సరళనాయిక; అందువలననే భావమును కనువయిన భావపూవున కనురూపమయిన తొడిమవలె నొప్పులోదవుచుండును. అవస్థలనుబట్టి యాలాపములు మాఱుట ప్రకృతి సిద్ధము. వరూధునియందు ఛాయలు మాఱును గాని శైలి సంపూర్ణమగు మార్పును బొందుట గావరాదు. ప్రవరాఖ్యుడు 'పొమ్మంచు ద్రోసిన' సందర్భమును బరిశీలింపుఁడు. ఆబిడ యాశాపతనమువలెనే యామె మాటల మధురిమయును భిన్నమైపోయినది. అపుడు 'కోపమునఁ జూచి'నదఁట. 'క్రేఁటుగొనుచు' బలికినదఁట. ఆవస్థలయందెంత తెచ్చుకోలు కోపమున్నను, సహజ సరళమయిన వాణియం దాపరిణామము వచ్చినదికాదు. కలస్వనములో నేడ్చుచు ఆబ్రాహ్మణుని దిట్టిన తిట్లన్నియు నాలకింపుఁడు. ఈరహస్యము గోచరింపఁగలదు. వరూధిని ప్రవరాఖ్యుని దూఱు భాగమును సత్యభామ శ్రీకృష్ణుని దూఱుభాగముతోఁ గలిసి చదువుఁడు. వరూధిని ప్రవరాఖ్యుని 'భూసురవర్య' యని సంబోధించినది. సత్య 'పసులకాపరి,'వల్లవీకింకర' యని తృణీకరించినది. సత్యా తిరస్కారమునకుఁ జిరపరిచయపారమ్యము నొక