Jump to content

పుట:Gopinatha-Ramayanamu1.pdf/6

వికీసోర్స్ నుండి
ఈ పుట అచ్చుదిద్దబడ్డది

ణాభ్యాం వేదం సముపబృంహయేత్" "ఇతిహాస (భారతరామాయణాదిపూర్వరాజవృత్తము,) పురాణము (సర్గప్రతిసర్గాదిపంచలక్షణసనున్వితము) లచే వేదార్థమును వివరింపవలయును" అను న్యాయమునుబట్టి దురవగాహ మగువేదార్థమును దాము చక్కఁగఁ బరిశీలించి మేఘముచేఁ ద్రావఁబడి విసృష్ట మైనసముద్రజలము సర్వజనోపజీవ్య మగునట్లు పండితపామరసామాన్యముగ నెల్లరకు సులభముగఁ దెలియురీతిఁ బరతత్త్వనిర్ణయమును, మోక్షోపాయనిష్కర్షమును జేసి బద్ధచేతనులకు సంసారసుఖసంతరణోపాయమును దెలిపిరి.

వాల్మీకి - శ్రీ రామాయణము

సంసారార్ణవనిమగ్నచేతనోద్ధరణార్థ మై పరమకారుణికత్వము నవలంబించి వేదార్థోపబృంహణము నొనరించినవారిలో వాల్మీకి ప్రథమగణ్యుఁడు.

"వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే
వేదః ప్రాచేతసా దాసీ త్సాక్షా ద్రామాయణాత్మనా”

"వేదముచేఁ దెలియఁబడు పరమపురుషుఁడు దాశరథి యై జనింప నావేదము కూడ వాల్మీకివలన రామాయణరూపముగఁ బరిణమించెను” అనున ట్లితఁడు సాక్షాద్వేదసమ్మిత మగురామాయణమును రచించి,

"ఇతిహాసపురాణాభ్యాం వేదాంతార్థః ప్రకాశ్యతే,
ప్రాయేణ పూర్వభాగార్థో ధర్మశాస్త్రాణ కథ్యతే.”

"వేదముయొక్క యుత్తరభాగార్థము (ఉపనిషదర్ధము) ఇతిహాసపురాణములచేతను, బూర్వభాగార్థము ధర్మశాస్త్రముచేతను వెల్లడియగుచున్నది.” అనురీతి నందు సకలముముక్షుజనోపజీవ్యము లయిన వేదాంతార్థములను సంపూర్ణముగఁ బ్రతిపాదించియున్నాఁడు.

శ్రీరామాయణోత్పత్తికి మూలమగుకథ

ఒకనాఁడు వాల్మీకి యదృచ్ఛగా దయచేసిననారదమునివలన శ్రీరామచరిత్రమును సంగ్రహముగ నుపదేశము నొంది యంత మాధ్యాహ్నికస్నానార్థము జాహ్నవీనదీసమీపమున నుండుతమసానది కరిగి యచట నిటునటుఁ జూచుచు సంచరించుచుండ నొకబోయ యానదీతీరవనమందు విహరించుక్రౌంచపక్షిమిథునములో మగపిట్టను గొట్టఁగాఁ జూచి కరుణార్ద్రచిత్తుఁడై యాకఱకుటెఱుకును గోపముతోఁ దిట్టఁగా నది యొకశ్లోకముగ వెలువడెను.

“మా నిషాద! ప్రతిష్ఠాం త్వ మగమ శ్శాశ్వతీ స్సమాః,
య త్క్రౌంచమిథునా దేక మవధీః కామమోహితమ్"

హఠాదావిర్భూతసారస్వతఝరీనిష్యందరూపం బగునీశ్లోకమును విని శిష్యుఁడు వెఱఁగంద నాసంయమీంద్రుఁ డప్పుణ్యనదిని దీర్థ మాడి యథోచితముగ సంధ్యా