|
వందిమాగధవాదకగాయకనటనర్తకాదులం గూడి సైన్యోపేతుండై హృద్యం
బు లగుమంగళవాద్యరవంబులు సెలంగ మరలి యయోధ్యకుం బోవునెడ.
| 1299
|
దశరథుఁడు మార్గమున దుశ్శకునములఁ గని వితర్కించుట
క. |
మొదల ఖగప్రకరంబులు, భిదురకఠోరస్వరములఁ బెల్లుగ మ్రోసెం
బదపడి సౌమ్యం బగు మృగ, కదంబము ప్రదక్షిణంబు గాఁ దిరిగె రహిన్.
| 1300
|
క. |
అత్తెఱఁగు సూచి రఘువం, శోత్తముఁ డగు నాదశరథుఁ డూహించి మనం
బుత్తలపడ వెస దాపస, సత్తముని వసిష్టుఁ గాంచి చయ్యనఁ బలికెన్.
| 1301
|
క. |
ఇది యేమికారణంబో, మొదల ఖగము లుగ్రభంగి మ్రోసెడు మృగముల్
పదపడి వలపటఁ దిరిగెడు, మదిఁ దహతహ వొడమె నింత మాకుం జెపుమా.
| 1302
|
చ. |
అన విని మౌనినాథుఁడు నృపాగ్రణి కి ట్లను వింటె ముంగల
న్ఘనముగ నొక్కయాపద దగ న్బొడము న్రహి నంతలోనఁ జ
య్యన మితివెట్ట రానివిజయంబు ఘటిల్లును నోడకుండు మం
చనునెడ దారుణాశుగధుతాతతధూళ జగంబు మ్రింగినన్.
| 1303
|
చ. |
కరిహరిసైన్య మొండొకటి గానఁగ లేక గలంగి పాఱె న
త్తరి రథికుల్ రథంబుల నుదారత డిగ్గి పరిభ్రమంబునం
బరువడిఁ బాఱి రుగ్రగతి భానునికాంతులు మాసెఁ దారక
ల్ధరపయి వ్రాలె దిక్కులు గలంగెఁ బయోనిధు లింకె నెంతయున్.
| 1304
|
వ. |
ఇట్టిమహోత్పాతంబులు పుట్టినం జూచి సపుత్రకుం డైనదశరథు౦డును వసిష్ఠాది
మునులునుం దక్కఁ దక్కినసర్వజనంబులను దలంకుచుండిరి మఱియు
నయ్యంధతమసంబున మునింగి యేమియుం దోఁచక సమస్తసైన్యంబు భస్మచ్ళ
న్నం బైనతెఱంగున నిశ్చేష్టితంబై యుండె నట్టియెడ.
| 1305
|
రఘురామునొద్దకుఁ బరశురాముఁడు వచ్చుట
సీ. |
మనములోఁ బొడమినమహితకోపరసంబు వెలికుబ్బెనా స్వేదజలము లొలయ
జయలక్ష్మిచే నొప్పెసఁగుమృణాళికతోడిపద్మంబనా ఘోరపరశు వలరఁ
దతకోపళిఖిశిఖాతతి వెలి బర్వెనాఁ గన్నులఁ గెంజాయ గడలుకొనఁగ
వీరరసాంభోధి వేలావిధంబున వికటభయంకరభ్రుకుటి మెఱయ
|
|
తే. |
నమితగతితో నొనర్చు తపోగ్ని మిడిసి, మౌళిపై సుడి గొన్న పెన్మంట లనఁగ
నెగడు కెంజూయ రంజిలు నిడుదజడలు, గ్రాల లోకభయంకరాకారుఁ డగుచు.
| 1306
|
చ. |
ఇరువదియొక్కమాఱు పృథివీశుల నెల్లఁ గుఠారధారచే
దర మిడి త్రుంచినట్టిజమదగ్నిసుతుం డరుదేరఁ గాంచి యం
|
|