|
బులును సమంబు లగుదర్భలును సంఘటించి విధిమంత్రపూర్వకంబుగా వివాహ
వేదికయందు వహ్నిప్రతిష్ఠాపనంబు చేసి మంగళహోమంబు లాచరించె
నంత జనకుండు సర్వాభరణభూషిత యైనసీతను రావించి వహ్నిసమక్షంబున
రామున కభిముఖంబుగాఁ గూర్చుండ నియోగించి కౌసల్యానందవర్ధనుం డగు
రామున కి ట్లనియె.
| 1284
|
తే. |
నాతనూజాత సాధ్వి యీసీత నీకు, ధర్మసహచరియై సంతతంబు ఛాయ
గతి ననుగతయై యుండు నీకన్యకరముఁ, గరమునఁ బ్రతిగ్రహింపుము గలుగు శుభము.
| 1285
|
క. |
అని పలికి సమ్మదంబున, జనకుడు శుభమంత్రపూతజలమును వెస రా
మునికరపంకజమున విడి, చెను సర్వజనములు సంతసించి నుతింపన్.
| 1286
|
క. |
అప్పుడు సురవాద్యధ్వను, లుప్పరమున మొనసె వేల్పు లొగి విరివానల్
కుప్పలుగాఁ గురిసిరి ముద, మొప్పఁగ నాడిరి సుపర్వయోషిజ్జనముల్.
| 1287
|
జనకుఁడు లక్ష్మణభరతశత్రుఘ్నులకు నూర్మిళామాండవీశ్రుతకీర్తుల నిచ్చుట
వ. |
ఇట్లు మంత్రోదకపురస్సరంబుగా దనపుత్రి సీతను రామున కొసంగి హర్షపరి
ప్లుతుండై జనకుండు వెండియు.
| i288
|
సీ. |
లక్ష్మణ గైకొమ్ము లక్షణవతి యైనదాని నూర్మిళను మత్తనయ నెలమిఁ
బరమహర్షంబునఁ భరత చేకొను నవ్యఘనకేశి మాండవీకన్య నిపుడు
శత్రుఘ్న మోదం బెసంగ నీశ్రుతకీర్తికరము గ్రహింపుము కరముచేత
నలువురు నయధర్మ మలర బత్నివంతులై సుఖింతురుగాక యనుచు బలుక
|
|
తే. |
జనకువచనంబు విని రాజతనయు లపుడు, నెమ్మితో రాజసుతలపాణిగ్రహణము
లర్థిఁ గావించిరి వసిష్ఠుననుమతమునఁ, దల్లిదండ్రులకోర్కులు పల్లవింప.
| 1289
|
తే. |
అంత సుముహూర్త మని సమ్మదాత్ము లగుచు, నడిమి తెర దీయ రఘుకులనాయకుండు
సీత నెమ్మోము గాంచి హర్షించె రాము, మోముఁ గనుఁగొని యలరె నామోహనాంగి.
| 1290
|
చ. |
రమణుని ముద్దుమోము గని రాకసుధాంశుని నిండువెన్నెలం
గొమరు వహించు కల్వలనఁ గోమలి వాలికచూపు లారఘూ
త్తమురమణీయదివ్యపదతామరసంబులమీఁద నెంతయుం
బ్రమద మెలర్చ వ్రాలెఁ బతిపాదములం బ్రణమిల్లుకైవడిన్.
| 1291
|
చ. |
జనకజమోము జూడ మఱి చన్గవఁ జూడఁగ గోరు జన్గవ
న్గనుఁగొన నవ్వల న్నడుముఁ గాంచఁగఁ గోరు సుమధ్యముం గనుం
గొన మఱి యూరువుల్ గనఁగఁ గోరు నరేంద్రుమనంబు భూవరుల్
|
|