|
వస్త్రమాల్యానులేపనంబులచేత నలంకృతుం డై వసిష్ఠవిశ్వామిత్రాదిమహ
ర్షులచేతఁ గృతవివాహసూత్రబంధనమంగళాచారుం డై విజయావహం బైన
వివాహానురూపశుభముహూర్తంబునందు మహర్షిసమేతుం డై యుత్సవశాలకుం
జనుదెంచె నంత నద్దశరథమహీనాథుండు కృతకౌతుకమంగళు లైనకుమా
రులం గూడి వసిష్ఠవిశ్వామిత్రాదిమహర్షులం బురస్కరించుకొని నానావిధమం
గళవాద్యఘోషపురస్సరంబుగా జనకమహీనాథునినగరద్వారంబు సేరం జని
యె నప్పుడు వనిష్టుండు జనకునికడకుం జని యి ట్లనియె.
| 1276
|
వసిష్ఠుఁడు జనకునికి దశరథుఁడు నగరద్వారంబున నున్నవాఁ డని తెల్పుట
క. |
చెలువుగఁ గృతకౌతుకమం, గళు లగుతనయులను గూడి కాకుత్స్థవరుం
డెలమిఁ జనుదెంచి వేడ్కం, దలవాకిట నున్నవాఁడు దాతను జూడన్.
| 1277
|
ఆ. |
దాతచేఁ బ్రతిగ్రహీతచే దానప్ర, తిగ్రహాదికములు దీర్చవలయుఁ
గాన నీవు పెండ్లికార్యంబుఁ గావించి, నేర్పుతో బ్రతిజ్ఞ నెఱపు మధిప.
| 1278
|
క. |
అని యిటు వసిష్ఠముని పా, వనచారిత్రకుఁడు పల్కఁ బరమోదారుం
డనుపమధర్మవిదుం డగు, జనకుం డి ట్లనియె మరల సంయమితోడన్.
| 1279
|
సీ. |
ఎలమితోఁ దన కడ్డ మెవ్వాఁడు వాకిటఁ దన కాజ్ఞ యొసఁగ స్వతంత్రుఁ డెవ్వఁ
డనఘాత్మ తనయింటఁ దనకు సందియ మేమి యూహింప నిది తనయూరు గాదె
మానుగఁ గృతసర్వమంగళాచారు లై మత్పుత్రికలు వేదిమధ్యమందు
జెలువొప్ప దీపాగ్నిశిఖలకైవడిఁ బ్రకాశించుచు నున్నవా రంచితముగ
|
|
తే. |
ననఘ విను మేను నీవేదియందె యుండి, కుతుక మలరార మీరాకఁ గోరుచున్న
వాఁడ నెందుకుఁ గాలయాపన మవిఘ్న, ముగ వివాహంబు సేయుఁడు ముదముతోడ.
| 1280
|
క. |
అని పలుక నపుడు మునిపతి, యనుమతమున దశరథేంద్రుఁ డఖిలమునులతోఁ దనయులఁ దోడ్కొని గ్రక్కున, మనుకులుఁడు వివాహవేదిమధ్యముఁ జేరెన్.
| 1281
|
సీతారామవివాహఘట్టము
క. |
జనకుఁడు వసిష్ఠుఁ గనుఁగొని, మునిపుంగవ మీరు సర్వమునియుతముగ రా
మునకు వివాహక్రియ గ్ర, క్కునఁ గావింపుఁ డిఁకఁ దడవు గూడ దనవుడున్.
| 1283
|
వ. |
భగవంతుం డైనవసిష్టుండు విశ్వామిత్రశతానందులం బురస్కరించుకొని ప్రపా
మధ్యంబున శాస్త్రోక్తప్రకారంబున వేదిక నిర్మించి దాని గంధపుష్పంబుల నలంక
రించి సువర్ణపాలికలను సాంకురంబు లగుకరకంబులును నంకురాఢ్యంబు లగుశరా
వంబులును నధూపకంబు లగుధూపపాత్రంబులును శంఖరూపపాత్రంబులును
స్రుక్స్రు వంబులును నర్ఘ్యపాత్రంబులును లాజపాత్రంబులును నక్షతపాత్రం
|
|