పుట:Goopa danpatulu.pdf/98

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

91

పలాయనము.

యాపురుషుడు తన్మందిరాధికారియని తెలిసికొన్న తర్వాత నతడించుక అర్జితుడై పెడమొగము బెట్టిన యేకాంతాగారములోనికేగి యొక వాల్గురిచీమీద నాసీనుడై తలపోయజొచ్చెను. తనమనస్సుల్ను బరిబరివిధముల బాదించు నాచెట్టియారు స్మృతికివచ్చి యట్టులుండెను. దంతధావనాది కృత్యములి చేయలేదు. తిన్ననిచూపుతో గొంతతడవు, ఆధోముఖముగా గొంతకాలము, మన యప్పలసామి కూర్చుండువాడు. కన్నులొక్కొకతఱి మూసికొను చుండువాడు. ఏదోతలమీదబ్రాకుచుండ దుడుచుకొను నట్లు తల దడవుకొనుచుండు వాడు. నిబ్బరంపు దృక్కులతో జూచుచు నప్రయత్నముగా గుడిచేతి బొట్టన వ్రేలి గొటిని గొఱుకుకొనుచుండువాడు. నడుమనడుమ దీర్ఘనిశ్వాసములం బుచ్చుచుండువాడు.

   అట్టులున్న మగనిస్దితి గవాక్షరంద్రములగుండ జూచి గంగమ్మ డాయనొడుచుండెను. ఆమెయు నేమిచేయుటకుం దోయక కాల్గాలిన పిల్లివలె దిరుగుచుండెను. ఆమెకూడ గాఫీ ముట్టలేదు. ఒక సారి పశ్చాతాపము, మఱియొకసారి రామయ్య యెడ వ్యామోహమును, నాపెకు గలుగుచుండెను. పండ్రెండు గంటల పిరంగిదెబ్బ వినబడెను. ఇంకను నాయకుడు లేవకుండెను. అప్పుడు గంగమ్మ సమీపించి "యేమె యట్టులాలోచనానిమగ్నులై యుంటి" రని యడిగెను. అప్పలసామి