పుట:Goopa danpatulu.pdf/99

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
92

గోపదంపతులు.

యొక్కనిట్టూర్పువిడిచి "గంగూ! కూర్చుండు" మని తనదగ్గఱనున్న కురిచీనిజూపెను. అప్పుడు వారిట్లు మాటాడుకొనిరి.

  అప్ప--గంగూ! నిన్నరాత్రి నిన్నుశాసించుచుగొంత పల్కిత్ని. నీయందు నాకుగల ప్రేమనీకుగఠినశాసనము లు విధించుటకును సమ్మతింపకుండెను. నీవు నాహృదయశల్యమూడబెఱకవా? 
     గంగ--ఏమాహృదయశల్యము? అది యూడబెఱుకుట యననేమి?
   అప్ప--ఏమో నీవే యెఱుగుదువు. మరల నానోట బల్కించుచుంటివి. నీకును గామయ్యకును సంబంధ మేమేని కలదా?
   గంగ-- మీరు క్రమకమముగా మితిమీఱి మాటాడు చుండిరి. నిజముగా మాకు సంబంధమెయున్న మీరు పట్టుకొనగలరా?
   అప్ప--లేకున్న, వాడును వానిస్నేహితుడును నీ వెంట సదా తిరుగుచుండు టేమి? వారెందులకిందు గదిపుచ్చుకొనియుంట? నీకొకవేళ వానిపై మోహమే యున్న, వానియం దేగొప్పతనముచూచి దానిం గాంచితివి? నీవు కోరునది ధనమా, యకల్మషప్రేమయా?
   గంగ--మీప్రశ్నల నన్నింటికిని నేను జవాబు జెప్ప జాలను. మిమ్మనుమానపిశాచ మావహించినది. ఇప్పుడేజవాబు చెప్పినను మీకు దృప్తికలుగదు. నాయనికి మీమన