పుట:Goopa danpatulu.pdf/97

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
90

గోపదంపతులు.

నన్నాశ్రయించునని తోచునేని, నేనాసుందరాంగుని యాహ్వాన మంగీకరించి సుఖింతుగాక" యని యామె తనలోదా బల్కికొని యవ్వల దానాచరింపవలసిన సేవా ధర్మమును యధావిధి నెఱవేర్చెను. ప్రదర్శనా నంతరమున దంపతులు గృహమునకేగిరి. ఒకరభిమానపూరితహృదయులు రెండవవా రనుమానపూరితహృదయులు. ఏదేని భావోద్రేకము కల్గినపుడు మాటలు మిక్కుటముగా రావు. కావున వారు దారిలొగాని నింటి కరిగినతర్వాతగాని నాటి కేమియు సంభాషించుకొనకుండిరి. అప్పలసామి యనుమానము మినుముట్టి వింతవింతరూపములు దాల్చుచుండ, గంగమ్మ యభీమానము బహుమార్గములు జరింప జూచుచుండ, రాత్రి చాలవఱకు గడచెను. తెల్లచ్వాఱజామున వారించుక కన్మూసి నిదురించిరి.

11. పలాయనము

     ఉదయభానుని కవోష్ణకరస్పర్శచే నప్పలసామి మేల్కాంచెను. అతడు పడకపైగూర్చుండి తనయిష్టదైవమును ధ్యానించి కన్నులు తెఱచు నప్పటి కెదుట గిటికీప్రక్క నొకపురుషవ్యక్తి నడచిపొవుచుండెను. అతడు ధరించిన పుట్టములం జూడ పచ్చమాకారమయ్యఛెట్టి తాల్చువానివలెనే తోచి యప్పలస్వామి యులికిపడిలేచి తలుపుతెఱచెను. కాని