పుట:Goopa danpatulu.pdf/96

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

89

సమ్మతి.

నేనంపిన కుసుమము లుపయోగార్హములు కాకున్న, మఱి యొక గులాబిపువ్వువ్వేని ధరించిరమ్ము. నీకొఱ కొకమోటారు కారులో మీప్రదర్శనశాలయొక్క పాణిద్వారముకడ వేచి యుండును. నాకింక భూమిమీద నన్నమేయున్నయెడల నీకు నాపై గరుణ గలుగకపోదు.

ఇట్లు నీదాసుడు,

రా మ య్య ఛెట్టి."

     ఈ జాబనెడు సూదంటురాయి మనకధానాయిక మనస్సు నవలీల నాకర్షింపగలిగెను. తన్నారీతి బతిగద్దించుట, పోటుమాటలాడుట, యామెకు గిట్టకుండెను. తాను జేసినది తప్పేయైనను, తన్నొరుల తప్పుబట్టునప్పు డభిమానవతియగు యువతి సహింపక మఱియుం దప్పదారులబడి చరించుట లోకస్వభాచ్వమేకదా! "నేనొనరించిన తప్పు నాకేతెలిసి నేనే దానిని సవరించుకొనవలె గాని,  యెంతపతియైనను దానింబురస్కరించుకొని నన్నను మానముతో జూచుటా! నేనొర్వజాల. ఇక నెట్టులును మాకాపురము సరిపడదు. బందీకృతనై యెట్లుజీవింతును? నేను నిలుచుటకు గూర్చుండుటకు గూడ శాసనముచేయుట. అందునకు నే నొడంబడుదునేని నాకాపురము దినదినంపుగండము వేయేండ్లాయువన్నట్టు లుండును. రేపు మరల నాభర్తతో గట్టిగా వాదించి నాకు బానిసతనము రాకుండ గాపాడుకొన ప్రయత్నిం తుగాక. అది తప్పక