పుట:Goopa danpatulu.pdf/78

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

71

పార్కు ఫేర్.

గపటస్నేహవృత్తిని భాషించుచు బోవుచుండిరి. వారికి గంగమ్మతో బరిచయము, చనువు, క్రమముగా స్నేహము, కుదిరెను. వారిలో నటేశ్ యామెకు గావలసిన పుష్పమాలిక లొసంగుచు నామెకోరిన రవికలగుడ్డలను జీరలను దెప్పించి యిచ్చుచు నామెచేరికను సంపాదించెను. రామయ్య విలాసచేష్టల చేత వింతమాటలచేతను నామెహృదయరంజనము గావించుచుండెను. ప్రతిదనమామె బజారునకుబోయి తన యిచ్చవచ్చిన వస్తువులను గొనితెచ్చుకొనుటకు భర్త మున్నేయామెననుమతించుటచేత, నతనికి వానింగూర్చిన యనుమానము లేకపోయెను. ఆమె తనయెదుటనాడు కపటనాటకమంతయుగాంచి యతడు భార్యనిర్దోషినియేయనియు నాముంజెనకి నా దుష్టులవశము గాదనియు నమ్ముచుండేను.

   ఈరీతిగా, గొంతకాలము గడిచెను. డిశంబరునెల వచ్చెను. ఆ నెల పదేవనాడు 'పార్కు ఫే ' రనబడు సంత గవర్నరుగారి గంభీత ప్రారంభోపన్యాసముతో బౌరులు యుత్సాహధక్యముతొ మొదలు పెట్టబడెను. ఆయేట నచ్చట దేశీయమహాసభ జరుగనుండుటచేత నేటేటకన్న నెక్కుచ్వ వినోదములు నిర్మింపబడు చున్నవి. ప్రతిరాష్ట్రమునుండియు మహాజనులెందరో రానై యున్నారనియు వారింజూచుటకును సభావిశేషములంకనుటకును  జెన్నరాష్ట్రమునందు వివిధ మండలములనుండి పెక్కండ్రు ధనవంతులు వత్తురనియు నెఱింగి  సమస్త వస్తువులయందును నాడెంపు సరకులన్నియు