పుట:Goopa danpatulu.pdf/77

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
70

గోపదంపతులు.

బుష్కలముగా ధనములభించుచున్నను గోపాలపట్టణ మందున్న మనశ్శాంతి యిచ్చట గలుగకున్నది.

   గంగ-- మీరు వెఱ్ఱి వెఱపులు  పెట్టుకొనవలదు. వారు నాకేమియు నెగ్గుచేయజాలరని నమ్ముడు.
    నప్ప--కానిమ్ము, రోటిలోదలదూర్చి రోకటిపోటు నకు వెఱవదగదుగదా? మొదట నేనిచ్చటికి రానియ్యకొంటయే తప్పు. వచ్చినతర్వాత నేమివచ్చినను సిద్ధపడవలెను. ఇప్పుడు గతజలసేతుబంధన మొనర్చుటవలన లాభములేదు.
    అని పలుకుచు దిండిదిని లేచును. గంగమ్మ  మనస్సు కూడ నయ్యో! వీరిరాక డాగురించితిగదా, యని కుందుచుండెను. 

9. పార్కు ఫేర్

    ఇట్టు లనుమానమనస్సుతో నప్పలసామియు నానాట విశేషాదరభావముతో గంగమ్మయు జెట్టియారుసోదరులను గాంచుచుండిరి. వారు ప్రతి దినము నాగదిలొనికివచ్చి  యేవో ముఖ్యరాజకార్యములు కొన్ని సవరించుకొనుచున్నట్లు నటించి యప్పలసామి యింటలేని తఱింగని యి చురకతడవు గంగాభాయితో  ముచ్చటలాడుచు నరుదుగా నప్పలసామితొ గూడ