పుట:Goopa danpatulu.pdf/79

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
72

గోపదంపతులు.

దెచ్చి వర్తకులు సంతవీధులలో బెక్కుదుకాణములను నెలకొల్పిరి.

   ఈసంత 'మూర్ మార్కెట్ ' అనబడు నంగడికి వెనుకనున్న మైదానములో నేర్పాటుచేయబడెను. సంతపట్టునకు జుట్టును గట్టి దడిగట్టి కావలివాండ్రను నియమిచియున్నారు. ఆయవరణలో బ్రవేశింఛుటకొక యఱరూపాయ పురపాలకసంఘవారికి చెల్లిపవలసి యున్నది. దానిం జొచ్చువారికి  దొలుత 'మేలైన మైసూరుపిత్తడిసామాను ' విక్రయించు నంగడికనబడును. అందు బలురకముల పాత్రసామగ్రి పుత్తడినిగ్గులనుమించు మించులచే వెలయునవి కొన్నియు, వెండి పూతపూయబడి శుద్ధరజతపాత్ర లేమోయను భ్రమగొలుపునవి కొన్నియు  గననగును. అసలు నెడమప్రక్క కేగ 'బీడీ ' లనబడు చిఱుచుట్టలమ్ము నంగడి చూపట్టును. ఆయంగడి యింటికప్పుమీద నొకజంత్రపుబొమ్మ యమర్చబడెను. ఆబొమ్మ యొకపాశ్చాత్య నాగరికుడు మహాసంతోషముతో 'బీడి ' కాల్సుచు దాని పొగను విలాసముగా విడుచుచున్నట్లు కనపడును. విద్యుచ్చక్తిచే నాకీలుబొమ్మ బీడి మొదట వ్రేళ్లసందున నిరికించినట్టును, దాని కాయంగడివాండ్రలో నొకడు నిప్పుముట్టించును. ఆ బొమ్మ మెల్లమెల్లగా 'బీడి ' ని నోటిదరికి జేర్చి నోట బెట్టుకొనుంజు. అవల రెందుమూడు గ్రుక్కల పొగ బీల్చి విలాసలీల దానిని వదలివేయును.