పుట:Goopa danpatulu.pdf/51

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
44

గోపదంపతులు.

చేయుటకుం బాలువోదు. నాకేదేని కొంతపని కల్పింతురేని, యాభారము కలుగదు.

   అప్ప—అదియే నేనును దలచుచుంటిని. నేనే ముందుగా జెప్పబోవుచుండ నీవేయడిగితివి. నీవుకూడ గొంతశరీరపరిశ్రమ మున్ను చేసియేయుంటివి. ఇటుపైని కొన్ని ‘ఫీట్సు ‘ స్త్రీలుచేయదగినవి, నీకునేర్పెదను. వానిని నేర్చికొందువేని, నీవునాతోబాటు నెలకు రెండువందలు గడింపగలవు.తనిపేరుకూడ తారాబజ్యిపేరువలె జరిత్రయందెక్కును. ఇందునకు నీయభిప్రాయమేమి?
     గంగ— నేనా? ‘ఫీట్సు ‘నేర్చుకొనుటా? రెండువందల గడించుటా? క్రొత్తమాటలాడుచుంటిరి!
    అప్ప—క్రొత్తమాటలేయైనను నేనుసత్యమేపలుకుచున్నాను. నీవట్లు సాముగరిడీలు నేర్చుకొన్న దప్పేమియులేదు. ఈచెన్నపురిలో ఝొప్పవాతిస్త్రీలుకూడ సభలలో సంగీతము పాడుదురు. ఉపన్యాసము లిత్తురు. ఉపధ్యాయినీత్వముగైకొందురు. కర్మాగారములనేలుదురు, పురుషులతో డెన్నిసు మున్నగు నాటలాడుదురు. అట్టిచో నీవేల గరిడీలనేర్వరాదు? ఈమహాపట్టణమం దాక్షేపణలుండవు. పల్లెటూళ్ళలో మాలవానికి మైలుదూరముగానిలిచునడుచువారు, ఈపట్టణములో బంచమునిపంక్తిని బంచభక్ష్యములును బాహాటముగా గుడుతురు. అందు కెవ్వరు దప్పుపట్టరు? పైగా నది