పుట:Goopa danpatulu.pdf/52

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

45

నాగరికత.

యొక సుగుణమందురు. అట్టి యీయూరనిన్ను, గేలిసేయుదురని వెఱవకుము.

    గంగ--మనవైపువారలు విన్ననవ్వరా?
   అప్ప--మనవైపువా రచ్చటనున్నప్పుడుండు నునికి వేరు, ఇచ్చటికి వచ్చినతర్వాత యునికివేరు. తాము తిన్నగా నున్నగద, మనల నాక్షేపించుట ! నీ కాక్షేపముండరు సరిగదా, విశేషించి మెచ్చుగలుగును. నామాటనిజము.
   గంగ--సరే, మీసెలవుప్రకారము నేర్చుకొందునను కొండు. శరీరమింత ముదిరినతర్వత నాకావిద్యలన్నియు నలవడునా?
   అప్ప--అలవడునో, యలవడవో, నీవెచూచెదవు గాక, నీకు సమ్మతియేకదా?
   గంగ--ఆ! సమ్మతియే, నాబాగోగుల భారమంతయు మీదేకదా!
   అప్పలసామి--యామఱునాటినుండియే యాయా క్రీడలకు దగిన పరికరములన్నియు సర్కసువారి నుండి పుచ్చుకొని బసకుగొనివచ్చి భార్యకు గొన్ని వింతక్రీడలను నేర్పజొచ్చెను. ఆమె వానినెల్ల ననాయాసముగా నేర్చుకొని మగినిమెప్పొందెను. ఒకనాడా రామస్వామి మొదలియారు తన సొదరునితోను మిత్రులతోను నప్పలసామియింటికి వచ్చి గంగమ్మచేయు సాముగరిడీల ప్రదర్శనమును గాంచెను. చూపఱులెల్ల నత్యాశ్చర్యపడిరి. సర్కసు యజమానుల యానందము