పుట:Goopa danpatulu.pdf/22

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

15

స్వప్నములు.

లమున జరిగిన పశుప్రదర్శనములయందు రెండుసారులు బహుమానము లందెను.

  అతడరుణోదయననేలేచి పొలమునకుబోయి యచ్చటనేశరీరవ్యాయామమొకింతతడవు సలిపి వ్యవసాయపు బనులు గొన్నిచక్కబెట్టుకొని యేడెన్మిది గంటల కిల్లుచేరును. ఇంటికి వచ్చుసరికి భార్య పసువుల మేతలు  పెట్టిపాల్పెరుగులను సిద్ధపఱచి యమ్మదగినవాని నమ్మిస్నానాదికృత్యములు గావించుకొని భర్తతోజల్దిగుడువసంసిద్ధియైయుండును.  అప్పలసామి పొలముండివచ్చి తోడనేతానమాడి మదికి మడుగు దోవతులు గట్టి యర్దాంగితో గూడి యించుక తడవుతన యిష్టదైవమగు సింహాచల నృసింహుని బూజచేసి యవల బాలలోరాత్రితోడుపెట్టియుంచిన యన్నమును బ్రియురాలితో ముచ్చటలాడుకొనుచు దినును. అసలనింటిపనులు కొన్నిసవరించుకొని పదిగంటలకు బసువులను ద్రోలుకొని పొలమునకెగి మరల వ్యవసాయకృత్యములాచరించుచుండును. మధ్యాహ్నము పండ్రేండుగంటలకు గంగమ్మ యొక పసులకాపరిచే మగనికన్నముంబట్టించుకొని పొలములోనికి వెళ్ళును. ఉభయులొక పాకలో గూర్చుండి  వేడుకలు చెప్పుకొనుచు నారరింతురు. తర్వాత నించుక సేపక్కడనే విశ్రమించి తెలుగుకధల పుస్తకములు గొన్ని చదువుకొందురు. మూడుగంటలు దాటినతర్వాత గంగమ్మ  యింటికి బోవును. అప్పలసామి తక్కిన కృషికార్యములు పూర్తి చేసుకొని పసువూతో బాటు తానుగూడ సూర్యాస్తమయమునకు గృ