పుట:Goopa danpatulu.pdf/23

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
16

గోపదంపతులు.

హముం జేరును. రాత్రినాదంపతుల ల్పాహారము భుజించి రెండుసేరులపాలనుద్రాగి శయనింతురు.

     ఇట్లు వారిదినచర్య కడుమనోహరమై యానంద దాయకమై యుండెను. అప్పలసామి నానాట సముపార్జించిన విత్తముతో దానుసాగుచేయుక్షేతమును విలిచి దానికిదగిన యెరూబెట్టి బలపఱుచుచుండెను. గంగమ్మ కాపురమునకు వచ్చి యెనిమిదేండ్లయినను బిల్లలు గలుగరైరి. పిల్లలులేని యాదంపతులు విచారపడుటయునులేదు. గంగమ్మతల్లి నడుమ నడుమ వచ్చి కూతునినల్లుని జూచి కొన్నిదినములు గోపాలపట్టణములోనుండి మరల విశాఘపురికి బొవు చుండెను. ఇంట వంటజేయు ముసలిది యొకనాడే వ్యాధియు లేకుండగనే మృతినొందె. భార్యాభర్తలు నొకరిద్దరు సేవకురాండ్రు మాత్రమే యాయింటనుండిరి. 
    చదువరులారా! మీకీపూర్వగాధయంతయు విరళముగా జెప్పి యించుక నిర్వేదము గల్గించితిని8. కాని వారిభావవిస్వభావములను వెల్లడించునపు డీ గాధలన్నియు మనకుపకరించును. గావున జెప్పక తీరనివియయ్యెను. మరల మన మానాయికా నాయకులతోనుండి సుందరమ్మతో గూడి చెన్నపట్టణపు బ్రయాణమునుగూర్చి వారుచేసికొన్న సంభాషణ మాలకింతము రండు.
       వారిరువురును గంచుగంచములో నన్నము బెట్టుకొని యొక్కొక్క ముద్దయేనోటనిడుకొనుచు నిట్లు మాటాడికొనిరి.