పుట:Goopa danpatulu.pdf/21

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
14

గోపదంపతులు

దికి రెండువందలరూపాయల సిస్తు నిచ్చుటకును నొప్పుకొని 'ముచ్చిలక ' వ్రాసియిచ్చి యింటికివచ్చి, యొకశుభ ముహూర్తమున దనసామగ్రియంతయు దీసికొని గోపాలపట్టణమును జేరుగొనెను. అక్కడ బ్రవేశించిన యొకవారములోపుననే యతడు గంగమ్మను వెంటబెట్టుకొని సింహాచలమునకు బోయి పెండ్లియాడి గోపాలపట్టణములో సుఖముగా గాపురము చేయ మొదలుపెట్టెను. పాపము తనకున్నయొక్క బిడ్డయు దన్నివిడిచివెళ్లుటచే మాణిక్యమ్మ మిగులు దు:ఖపరవశయై యుండెను. కాని వలపు వెల్లువ నాపుటకు దనవలనకాదనియు, భగవంతునియిచ్చ యట్లుండ దానుదు:ఖించి లాభములేదనియు దలచి యూరటవహించి తనయూడిగ యెప్పటియట్లు చేసికొనుచుండెను.

       తనతండ్రికి వండిపెట్టుముసలిది యింట బాక కృత్యములొనరించుచుండ, నప్పలసామి గంగమ్మతో గోపాలపట్టణమున సుఖముగా జీవయాత్రజేయుచు, బోలీసువారిచ్చిన సొమ్ములో, గొంతపెట్టి మంచిపాడి పసువులనుగొని వానిని చానుసాగుచేయు పొలములో జాగ్రత్తగామేపుకొనుచు, వానిపాలనమ్మి కొంతసొమ్ము సంపాదించుచు, నత్యంతాఅందముతొ నుండేను. నానాట నతని గోధనము వృద్ధియై వాని వర్తకముపెరుగుచుండెను. మనకధ ప్రారంభించునాటి కతని యొద్ద నిరువది యావులును బదిగేదెలును గలవు. వానికి బుట్టిన రకరకముల కోడెదూడల నతడు మిగులమురిపెముతో బెంచి యామండ