పుట:Goopa danpatulu.pdf/177

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
170

గోపదంపతులు.

దిక్కులన్నియు మార్మోయు నట్లుగా బిగ్గరగా రోదన మొనరించెను. అది యర్దరాత్ర మించుకమీఱియున్న సమయము నిర్జనప్రదేశము. ఆమెకుమార్వలుక నక్కలును గుడ్లగూబలును దప్ప నితరములు లేవు. ఆయెయెంత సేపేడ్చినను, నొదార్చు వారెవ్వరును లేరు. "అయ్యో! నేనెంత దుర్మార్గురాలను! నాబ్రతు కాదినుండియు గళంకపూరితమైయే యుడెగదా! చిన్ననాడా, తల్లిమాట పెడచెవిని బెట్టి యామెకిష్టము లేని పెండ్లి చేసికొంటిగదా! దానిచే నామె మనస్సు వలయించితిని. తరువాత నాభర్త కిష్టములెని పట్టణ జీవనమునకు బురిగొల్పి యతనితో బాటు మహాపట్టణముని నివసించుచు నారొగ్యకరములగు నభ్యాసముల నాచారములను విడిచిపెట్టి, తుదకు నీతికూడ బోగొట్టుకొని యన్యపురుషునితో గాపురమొనర్చితిగదా! అత్తఱి నేననుభవించిన వైభవములకు గర్వపడి కన్నుగానక చరించితిగదా! నేనొర్చిన పాపములకు బ్రత్యక్షఫలమైన నాకూతునందు వెఱ్ఱిమమత నొందియుండి యీమహానుభావుని బలుభంగుల మొస మొనరించితిగదా! నాచర్య గప్పిపుచ్చుట కెందఱితోనో యెన్నోయబద్ధముల నాడి యుంటిగదా! కడపటి నిముసమందుసైతము నాకుపకృతియెనరించుటకే యత్నించిన నాహృదయేశ్వరుని బల్తెఱంగుల మోస పుచ్చితినిగదా! తుదకితని ప్రాణముల బొద్రోలు ఘోరవిపత్తును గల్పించితి గదా! నేనతనిని వెంబడింపకున్న నిట్టి యాపదరాదుగదా! (డగుత్తికతో) నేనే యీయన మరణమునకు గారకురాలనైతిని. ఈమహామహుని నాపొట్టబెట్టి