పుట:Goopa danpatulu.pdf/176

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

169

నిధనము.

తెలివివచ్చెనుగాని, యతడు భరింపరాని యాయాసముతోచుచుండెను. తానిక బ్రతుకనని తలచి యతడెట్టులేని గట్టును జేరికొనగొరి, యేటబడి మల మెల్లగా బారలువైచుచు నీదజొచ్చెను. ఎంతో ప్రయాసము మీద నతడొడ్దునకు రాగలిగెను. కాని వచ్చిన కొన్నినిముషములకే యధికాయాసముచేతను, విశేషరక్తస్రావముచేతను, నతనిగుండె యాగిపోయెను. అప్పలసామి కీర్తిశేషుడయ్యెను.

   సికతాతలంబునం బడియున్న గంగమ్మ యించుక తేఱుకొని, యేటబడిన మగడు బయటికి వచ్చెనో లేదో చూడగోరి లేచియరయగా దనకించుకదవ్వున నాతడు పడియుంట యామెగాంచి, మెల్లగా నతనికడకేగెను. చైతన్యము లేకపడియున్న నాధునింగాంచి యామె కలవరపడి "నాధా! యేలయిట్టులుంటి"  రని పలుకుచు చేతితొదట్టిలేపను. అతడు మర్వలకలేదు. కదిలించిన గదలలేదు. నాసికారంధ్రములకడ వ్రేళ్లుంచి చూడ, నూరిగవచ్చుచున్నట్లు కనబడలేదు. ఆమెమఱియు గలతపడి "అయ్యో! ప్ర్ర్రణేశ్వరా! పలుకరేమి?" యని దేహమంతయు  గంపింపజేసి చూచెను. కాని జవాబు లేకుండెను. అంతనామె గుండెబాదుకొనియు దల నేలపై బగులకొట్టుకొనియు  నేడువసాగెను. ఆయాసముచే బ్రాణముకడగంటిన దేమో మరల కొంతసేపటికైన దెలివివచ్చునేమో యని యామె యాగిచూచెను. కానియేమియు మార్పు కనబడదయ్యె, అప్పుడామె తనభర్త తనకొఱకై ప్రాణములు గోల్పోయననియే నిశ్చయించుకొని