పుట:Goopa danpatulu.pdf/178

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

171

నిధనము.

కొంటిని. ఇకనేనీభూమిపై బ్రతికి యేమిప్రయోజనము? (అని యొకింత తడవాగి) తల్లీ! శకుంతలా! నాకునీతో బూర్తిగా ఋణము చెల్లినది. నీవిక నెవ్వరి పాలబడుదువో గదా! నారుపోసినదేవుడు నీరుపోయడా యని యింతదనుక ధైర్యమువహించి నిన్నుపేక్షించు చుంటిని. ఇప్పుడు నిన్నుబూర్తిగా లోకమునకు విడిచి పెట్టి నాదారిని నేనేగుచున్నాను. తల్లీ! దయామయుడగు నీశ్వరు డనాధబాలికవగు నీయెడ ననుకరింపబూని నీకాయురాదులొసంగి నిన్ను సర్వదా కాపాడుగాత! ఈశ్వరుడే నీకుమాతాపితలు, ఉదారస్వభావులగు ప్రజలే నీకు జుట్టములు."

     అనుచు నామెపరమవేదన మొనర్చి యామె బర్త కళేబరమునకు మూడు ప్రదక్షిణములు గావించి యతని పాదములపైబడి కన్నీటిచే నభిషేకమొనరించి, యచ్చటికొండపై నున్నరాలలో బెద్దదియొకటి దొరిలించుకొనివచ్చి దానినినడుమునకు, భర్తపంచకొంగుచించి త్రాడుగా నుపయోగించి, కట్టుకొని,"హర హర! మహాదేవ!" కేకపెట్టుచ్ నీటిలోనికి దిగి లోతున్లీలోనికిబోయి యొకటిరెండు బుడగలతో మునిగిపోయెను. అప్పటికి మూడుజాములరాత్రి మీఱియున్నది. పక్షులు రెక్క లాడించుచున్నవి. ఆమెవైచినకేకయాప్రక్కనడుచు చున్నయొక పాలికాపునకు వినబడ నతడు వేగముగా నదిలోనికి దుమికి చూచెను. వాడు మచి యీతగాడగుటచే నేఱంతయు గలయనీదను. గంగమ్మ ప్రాణవాయువులు విడిచియే యున్నను, రాతి బరువుక్రింది