పుట:Goopa danpatulu.pdf/157

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
150

గొపదంపతులు.

నప్పలసామి క్షేత్రమునుండి యింటికివచ్చెను. వానికెదుట దమిళులు కనబడుటచే దనయాజ్ఞదప్పి చరించుచున్నదని యాతడు భార్యపై గినిసెను. కాని కినుకచూపుటకిది సమయముగాదని యెంచి తనగదిలొనికి బోవుచుండెను. దారిలో దనభార్య సుబ్బులక్ష్మమ్మచేతికిచ్చు శిశువువంకజూచి యాగిపోయి, 'యీపిల్ల ' యెవరని వారలనడిగెను. వారిలొ సుబ్బులక్ష్మమ్మ మామనుమరాలని చెప్పి గంగమ్మ మానము గాపాడెను. అప్పలసామి బిడ్డవంక దేఱిపాఱజూచి "నేనానడుమ జెన్నపురిలో నొకపిల్లను, బంతికై బరువెత్తిపొవుచు వంతెనక్రింది యేటిలో బడిపొవనున్నదానిని, నపాయమునుండి తప్పించి కాపాడితిని.ఆబిడ్డరామయ్యఛెట్టిగారికూతురని యవ్వల దెలిసినది. ఈశిశువు కూడ నచ్చ మాశిశువువలెనే యున్నది" అనెను. వారందఱు దెల్లబోయిరి. "ఎల యట్లు తెలతెలబోవుచున్నా"రని" యతడు వారినడుగగా, సుబ్బులక్ష్మమ్మ "మఱేమియుగాదు. వాడాపిల్లప్రాణములిచ్చినది మీరా,యని యాశ్చర్యపడుచున్నాము. మేమరామయ్యచెట్టిగావించిన విందునకుబొయితిమి అప్పటికి బిడ్దను గాపాడిన వారెవ్వరికిని దెలియకుండెను. నేడప్రయత్నముగా మీరేయని మాఱుపలికెను. నాడు తనకూతుప్రాణములుగాచిన పుణ్యాత్ముడు తనప్రాణకాంతుడేయని తెలిసినప్పుడు గంగమ్మ మరల వెనుకటి హేయజీవనమును జ్ఞప్తికిదెచ్చుకొని