పుట:Goopa danpatulu.pdf/158

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

151

ఆశ్లేషణము.

యిట్టి మహోపకారిశీలిని నిట్టి మహామహిమాన్వితుని, నిట్టి పురుషపుంగవుని వీడి యొక్క చంచలహృదయుని, మధాంధుని కపటశీలిని, జెట్టబట్టి తనదేహము, ఆత్మయు, నపవిత్రపఱునుగొంటిగదా యని లోలోన నత్యంతదు:ముని బొందెను.

    అప్పలసామి యట్లుపలికి తనగదిలోనికి బోయెను. తమిళులు గంగమ్మకడ సెలవుపుచ్చుకొని బిడ్డతో నింటికి బయనమైరి. వారిని వీధిగుమ్మముదాక వెళ్లి సాగనంపదలచి గంగమ్మగూడ నడచెను. వారు వీధిలోని కేగినపిమ్మట గంగమ్మ సుబ్బలక్ష్మమ్మతొ మెల్లగా, "తల్లీ! మీరు మూడునాల్గు దినములాగి, బిడ్డ సుందరేమ్మగారితొను వారిబిడ్డలతొను బరిచయము గలిగించుకొని యించుక చనవుతొ, దిరుగాడువఱకు జూచి మఱిపోవలయును. (బిడ్డవంకదిరిగి) అమ్మా! రేపు నీదగ్గఱకు వచ్చి నేనే బువ్వపెట్టెదను. నేటి కమ్మక్కగారే నీకన్నముబెట్టుదురు. అక్కడ నీకన్నయలు, అక్కయ్యలు, చిన్నవారు-- వీఱందరు గలరు. వారితొ నాడుకొనుచుండుము. (ముందువెంకలచూచి ముద్దుపెట్టుకొని) పొమ్మూ అనిపల్కి వారిననిచి, లోనికిబొయెను.
    ఇప్పట్ల నాహృదయావేగము వర్ణీంపబూనుట కన్న నూహించుకొనుడని చరునగులకే విడిచిపెట్టుట మేలని మానితిమి. అప్పలసామి భార్యను దమినులతో సంపర్కమువలదని మరల గట్టిగాజెప్పి సాయంస్నానమునకు బోయెను.