పుట:Goopa danpatulu.pdf/130

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

123

తోటవిందు.

    గంగమ్మ--మాకునచ్చట బాలిచ్చు గంగమ్మ మీకేమేని చుట్టమా?
   గంగ--(లజ్జచే నింకముం దలవంచియే) అమ్మా! ఆనిర్భాగ్యురాలను నేనే. నాభర్తకును నాకును గొన్ని వివాదములురాగా నేనీచెట్టిగారి యండనుండి జీవించుచుంటిని. నాయనికి నాభర్తకు దెలియదినియే నానమ్మకము. మీరును నన్నుగూర్చి యెవ్వరికిని జెప్పకుందురువాక యని కొరుచున్నాను.
  సుబ్బు--అమ్మా! నేనెవ్వరితో జప్పను ! నాకేమి కావలయును? ఏదెట్టులైనను, నీవు సుఖముగా మనుచుంటివి. పండువంటి బిడ్డను గంటివి. నాకు జాల సంతోషముగా నున్నది. అమ్మా! నీభర్త నీకుకూలుడేగదా!
    గంగ--అమ్మా! అనుకూలురే, కాని హృదయము నకేదో యావేదనయే సర్వదా కలుగుచుండును. ఆనందములేకున్నది.
    స్దుబ్బు--ఎక్కడికక్కడికే సరిపెట్టుకొనవలయును.  చింతల నొందరాదు.
    గంగ--తమబసయెక్కడ?
      సుబ్బు--తిరువనక్కేణిలోని వీరరాఘవ మొదలియారు వీధియందు 111 వ యింటి యందు మేము వసింతుము. ఎప్పుడేని 'షికారు ' గా మాయింటికి కొకసారి రాగోరుచున్నాను.