పుట:Goopa danpatulu.pdf/129

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు
122

గోపదంపతులు.

య్యచెట్టిచే నాహ్వానింపబడెను. అతడును భార్యయు విందారగించిరి. అతనిభార్యయౌసుబ్బులక్షమ్మతో నామెకూతులిరువురును విందుకేతెంచిరి.ఇప్పుడు గంగమ్మ మాటాడుచుంట యాస్త్రీలతోనే. వారు, రామయ్యచెట్టి భార్యయెవ్వతెయో యనుకొనిరి. కాని పరికించి చూడ దనపెద్దకొమరితయగు సుందరమ్మకు గోపాలపట్టణములో బరిచయురాలగు గంగమ్మయేయని సుబ్బలక్ష్మమ్మ గుర్తింపగలిగెను. ఆవిందారగించు సమయమున గంగమ్మనుజూచి 'అమ్మా! ఇంతకు మున్ను మెమ్మెక్కడనో చూచితినని తోచుచున్నది. మీరెఫ్ఫుడేని గోపాలపట్టణములో నుంటిరా? " యనియనియెను. గంగమ్మ యుంటినని మార్వలుకుచు నావల భాషించుకొందమని నిలిపివైచెను. విందుముగిసి యందఱేగినతర్వాత గంగ మ్మ వారిని దీసికొని లోపలిగదిలోనికిబోయి యిట్లు భాషింపదొడగెను.

     గంగమ్మ--అమ్మా! మీరు గోపాలపట్టణ మెప్పుడు వచ్చితిరి. 
  సుబ్బు--మాయమ్మాయి, సుందరమ్మ, స్టేషన్ మాస్టరుగారి బార్య యచ్చటనే యున్నది గావున, నేనాయూరికి దఱుచుగా బొవుచుందును. ఓకప్పుడు మిమ్మచ్చటజూచినట్లు జ్ఞాపకమున్నది.
    గంగ--అవునమ్మా, చూచియేయుందురు. మేము గోపాలపట్టణములోనే యుండువారము. (అనిసిగ్గుచే దలవంచుకొనెను.)